Taraka Ratna: తారక రత్న కూతురి పుట్టిన రోజు.. ‘మీ ప్రతి అడుగులో తోడుగా ఉంటాను’ అంటూ అలేఖ్య ఎమోషనల్

టుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తారక రత్న రాజకీయాల్లోనూ రాణించాలనుకున్నాడు. తన తాత లాగే ప్రజలకు తన వంతు సేవ చేయాలనుకున్నారు. అయితే విధి మాత్రం వేరేలా ఆలోచించింది. నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రల్లో పాల్గొన్న తారక రత్న గుండెపోటుకు గురయ్యాడు. సుమారు నెల రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొంది సరిగ్గా శివ రాత్రి రోజు శివైక్యం చెందాడు.

Taraka Ratna: తారక రత్న కూతురి పుట్టిన రోజు.. 'మీ ప్రతి అడుగులో తోడుగా ఉంటాను' అంటూ అలేఖ్య ఎమోషనల్
Taraka Ratna Family
Follow us
Basha Shek

|

Updated on: Dec 31, 2023 | 4:28 PM

నందమూరి తారక రత్న ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయి సుమారు ఏడాది కావోస్తోంది. ‘ఒకటో నంబర్‌ కుర్రాడి’తో హీరోగా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ నందమూరి అబ్బాయి విలన్‌గానూ నటించి మెప్పించాడు. నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తారక రత్న రాజకీయాల్లోనూ రాణించాలనుకున్నాడు. తన తాత లాగే ప్రజలకు తన వంతు సేవ చేయాలనుకున్నారు. అయితే విధి మాత్రం వేరేలా ఆలోచించింది. నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రల్లో పాల్గొన్న తారక రత్న గుండెపోటుకు గురయ్యాడు. సుమారు నెల రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొంది సరిగ్గా శివ రాత్రి రోజు శివైక్యం చెందాడు. తారక రత్న మృతితో అతని భార్య బిడ్డలు ఇప్పటికీ కోలుకోలేకపోతున్నారు. ముఖ్యంగా తారక రత్న సతీమణి అలేఖ్యా రెడ్డి తన భర్త జ్ఞాపకాల్లోనే జీవిస్తోంది. సోషల్‌ మీడియా వేదికగా తన భర్తతో గడిపిన మధుర క్షణాలను పంచుకుంటూ ఉంటుంది. తారక రత్న- అలేఖ్య దంపతులకు మొత్తం మొగ్గురు పిల్లలున్నారు. మొదట అమ్మాయి పుట్టగా, ఆతర్వాత ఇద్దరు కవలలు జన్మించారు. తన తండ్రి NTR పేరు కలిసి వచ్చేలా తన ముగ్గురు పిల్లలకు నిష్క(N), తాన్యారామ్(T),రేయా(R) అని పేర్లు పెట్టారు. ఇదిలా ఉంటే ఆదివారం (డిసెంబర్‌ 31) పెద్ద కూతురు నిష్క పుట్టిన రోజు. ఈ మేరకు తన కూతురుకు సోషల్‌ మీడియా వేదికగా బర్త్‌ డే విషెస్‌ చెప్పింది అలేఖ్య.

తన ముద్దుల కుమార్తె అందమైన ఫొటోలను షేర్‌ చేసిన తారక రత్న సతీమణి ‘నువ్వు ఈ లోకంలోకి వచ్చిన నిముషం నుంచి మాకెంతో గర్వంగా ఉంది. నీ నువ్వు, ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలని దేవుడిని కోరుకుంటున్నాను. నీలాంటి కూతురు ఉండాలని అందరూ కోరుకుంటారు. మీ ప్రతి అడుగులో మిమ్మల్ని ప్రేమించడానికి, మద్దతు ఇవ్వడానికి మీ మమ్ము (అమ్మ) నిత్యం మీతోనే ఉంటుంది’ అని తన కూతురిపై తనకున్న ప్రేమకు అక్షర రూపమిచ్చింది తారక రత్న. ప్రస్తుతం ఈ పోస్ట్‌, తారక రత్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. పలువురు ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు నిష్కకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

తారక రత్న కూతురు నిష్క బర్త్ డే ఫొటోలు..

తారక రత్న కూతురు బర్త్ డే సెలబ్రేషన్స్..

తారక రత్న చిత్ర పటం దగ్గర..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.