Bigg Boss 6 Telugu: రేవంత్ పై ఓ రేంజ్‌లో సీరియస్ అయిన హౌస్ మేట్స్.. ఫైమా వార్నింగ్ నెక్ట్స్ లెవల్
ఫైమా అయితే ఓ రేంజ్ లో సీరియస్ అయ్యింది. రేవంత్ నెగిటివ్ గా మాట్లాడతాడని.. మాటలు మారుస్తూ ఉంటాడని అంది. ముందుగా ఆదిరెడ్డి రేవంత్ తో గొడవకుదిగాడు.
బిగ్ బాస్ హౌస్ లో మరోసారి రచ్చ మొదలైంది. హౌస్ మేట్స్ నామినేషన్స్ ప్రక్రియలో ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ నానా హంగామా చేశారు. అయితే ఈసారి కాస్త గట్టిగానే అరుచుకున్న ఇంటి సభ్యులు. ముఖ్యంగా రేవంత్ ను టార్గెట్ చేసి హౌస్ మేట్స్ కాస్త గట్టిగానే వాదించుకున్నారు. ఫైమా అయితే ఓ రేంజ్ లో సీరియస్ అయ్యింది. రేవంత్ నెగిటివ్ గా మాట్లాడతాడని.. మాటలు మారుస్తూ ఉంటాడని అంది. ముందుగా ఆదిరెడ్డి రేవంత్ తో గొడవకుదిగాడు. ఆదిరెడ్డి బంగారుతల్లీ అని అని అనగానే ‘నేను తల్లిని కాదు.. తండ్రిని’ అని అన్నాడు రేవంత్.. వెంటనే ‘నవ్వు తల్లో తండ్రో.. ఏదోటి వేసుకోగానీ’ అంటూ సెటైర్ వేశాడు ఆదిరెడ్డి. నేను చేసిన తప్పుని యాక్సెప్ట్ చేసే ధైర్యం నా దగ్గర ఉంది.. అది నీ దగ్గర లేదు అని ఆదిరెడ్డి అంటే.. ‘ధైర్యం గురించి నా దగ్గర మాట్లాడకు’ అని అన్నాడు రేవంత్. ‘నువ్ మాట్లాడొద్దంటే మాట్లాడనా.. మాట్లాడతా’ అని ఆదిరెడ్డి కాస్త గట్టిగానే అన్నాడు.
ఆతర్వాత ఫైమా రంగంలోకి దిగింది. రేవంత్ ను ఫెమ్ ను ఉద్దేశించి మాట్లాడుతూ.. వేరే వాడి సపోర్ట్ లేనిదే నువ్ గేమ్ ఆడలేవ్.. నువ్ నాకు చెప్తున్నావ్’ అని అన్నాడు.దాంతో ఫైమాకు పట్టరాని కోపం వచ్చింది. ‘నేను సపోర్ట్ లేకుండా ఆడలేనన్నావ్.. నువ్ సపోర్ట్ లేకుండా ఆడావా? అని వార్నింగ్ ఇస్తూ.. వేలు చూపించింది. దీంతో రేవంత్ ‘నాకు వేలు చూపించి మాట్లాడకు.. హే… వేలు చూపించకు’ అంటూ రెచ్చిపోయాడు…. ‘సపోర్ట్‌తో ఆడిన రేవంత్.. సపోర్ట్ గురించి మాట్లాడుతున్నాడు.. మాటలు మారుస్తూ ఉంటాడు.. ఇక్కడొక మాట.. అక్కడొక మాట.. కీర్తీ నువ్ సూపర్ ఆడతావ్ అంటాడు.. మళ్లీ అక్కడికి వెళ్లి.. కీర్తి ఆడనే ఆడదని అంటాడు. అంటూ రేవంత్ ,గురించి చెప్పుకొచ్చింది. ఈ మాటలు మార్చేవ్యక్తి ఎవరికీ కనిపించడం లేదా? ముందొక మాట వెనకొకమాట.. ఏరోజూ ఎవరూ ఈ పాయింట్ గురించి మాత్రం మాట్లాడరు. ముందు నుంచి నోరు జారుతూనే ఉన్నాడు.. అవి ఎందుకు కనిపించడం లేదు అంటూ మండిపడింది ఫైమా.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.