AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bichagadu 2: బిచ్చగాడు 2 మొదటి రోజు ఎంత వసూల్ చేసిందో తెలుసా..? ఇది అస్సలు ఊహించలేదు గురూ..

విజయ్ ఆంటోని హీరోగా నటించిన ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది. సంగీత దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన విజయ్ ఆంటోని.. నటుడిగా మారి ‘నకిలీ’ ‘డాక్టర్ సలీమ్’ వంటి హిట్ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే.  బిచ్చగాడు తమిళ్ సినిమా అయినప్పటికీ తెలుగులో డబ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. తమిళ్‌‌‌‌లో వచ్చిన పిచ్చైకారన్ సినిమాను బిచ్చగాడు అనే టైటిల్‌‌‌తో తెలుగులో విడుదల చేశారు.

Bichagadu 2: బిచ్చగాడు 2 మొదటి రోజు ఎంత వసూల్ చేసిందో తెలుసా..? ఇది అస్సలు ఊహించలేదు గురూ..
Bichagadu 2
Rajeev Rayala
|

Updated on: May 20, 2023 | 2:25 PM

Share

బిచ్చగాడు.. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విజయ్ ఆంటోని హీరోగా నటించిన ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది. సంగీత దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన విజయ్ ఆంటోని.. నటుడిగా మారి ‘నకిలీ’ ‘డాక్టర్ సలీమ్’ వంటి హిట్ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే.  బిచ్చగాడు తమిళ్ సినిమా అయినప్పటికీ తెలుగులో డబ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. తమిళ్‌‌‌‌లో వచ్చిన పిచ్చైకారన్ సినిమాను బిచ్చగాడు అనే టైటిల్‌‌‌తో తెలుగులో విడుదల చేశారు. ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్‌‌‌తో తెరకెక్కిన ఈ సినిమా అక్కడా.. ఇక్కడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని అమ్మ సెటిమెంట్ ప్రతిఒక్కరిని కదిలించింది. ఇప్పుడు బిచ్చగాడు 2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్. ఇక ఈ సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా ఫస్ట్ డే ఎంత వసూల్ చేసిందంటే..

నైజాం 0.72 కోట్లు, సీడెడ్ 0.35 కోట్లు, ఉత్తరాంధ్ర 0.32 కోట్లు, ఈస్ట్ 0.20 కోట్లు, వెస్ట్ 0.14 కోట్లు, గుంటూరు 0.22 కోట్లు, కృష్ణా 0.18 కోట్లు, నెల్లూరు 0.10 కోట్లు, ఏపీ, తెలంగాణ (టోటల్) 2.23 కోట్లు వసూల్ చేసింది.

బిచ్చగాడు 2 సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రూ.5.85 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. మొదటి రోజు ఈ చిత్రం ఏకంగా రూ.2.23 కోట్ల షేర్ ను రాబట్టింది.