Bellamkonda ganesh: ”నాకు సినిమాలు, సినిమా సెట్ కొత్త కాదు”.. బెల్లంకొండ గణేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఈ యంగ్ హీరో నటించిన స్వాతి ముత్యం సినిమా దసరాకనుకగా రేపు (అక్టోబర్ 5న) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Bellamkonda ganesh: ''నాకు సినిమాలు, సినిమా సెట్ కొత్త కాదు''.. బెల్లంకొండ గణేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Bellamkonda Ganesh
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 04, 2022 | 7:48 PM

బెల్లంకొండ ఫ్యామిలీ నుంచిహీరోగా పరిచయం అయివుతున్న కుర్రాడు బెల్లంకొండ గణేష్. ఈ యంగ్ హీరో నటించిన స్వాతి ముత్యం సినిమా దసరాకనుకగా రేపు (అక్టోబర్ 5న) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. స్వాతిముత్యం సినిమాలో బెల్లంకొండ గణేష్ కు జోడీగా  వర్ష బొల్లమ్మ నటిస్తోంది.  ఈ చిత్రంతో లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. వినోదభరితమైన ఈ కుటుంబ కథా చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ.. నేను ఓ మంచి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమవ్వాలని ఎదురుచూస్తున్న సమయంలో లక్ష్మణ్ ఈ కథ చెప్పారు. ఈ కథతో వస్తే తెలుగు ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారని నమ్మి, ఈ కథను సితార వారి దగ్గరకు తీసుకెళ్లగా నాగ వంశీ గారికి కూడా కథ నచ్చింది. ఇది తమ బ్యానర్ లో చేస్తే మంచి సినిమా అవుతుందని భావించిన ఆయన ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు అన్నారు.

సినిమా అంటే ఖచ్చితంగా పోరాట సన్నివేశాలు ఉండాలని నేను అనుకోను. సినిమా బాగుంటే ప్రేక్షకులు ఎలాంటి జోనర్ సినిమానైనా ఆదరిస్తారు. కథ బాగుండాలి, సినిమా బాగుండాలి అని ఆలోచించాను కానీ ప్రత్యేకంగా ఈ జోనర్ లోనే సినిమా చేయాలని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. ప్రస్తుతం కథలో కొత్తదనం లేకపోతే ప్రేక్షకులు థియేటర్లకు రావడంలేదు. తర్వాత ఓటీటీలో చూడొచ్చులే అనుకుంటున్నారు. అందుకే నేను కత్తదనం ఉన్న కథ కోసం వెతుకుతుండగా.. లక్ష్మణ్ వచ్చి ఈ కథ చెప్పారు. ఈ కథలో వైవిద్యం ఉంది. ఇది ప్రేక్షకులను అలరిస్తుందని నమ్మి ఈ సినిమా చేయడం జరిగింది అన్నారు.

అలాగే  సినిమా రంగం, సినిమా సెట్ నాకు కొత్త కాదు. ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకున్న అనుభవం ఉంది. మొదటి నుంచి సినిమా రంగంలోనే ఉండాలి, ఇక్కడే ఏదోకటి చేయాలని అనుకునేవాడిని. తెర వెనక ప్రొడక్షన్ వ్యవహారాలు అలవాటే గానీ కెమెరా ముందు నటించడం ఇదే మొదటిసారి. అయితే ముందే నటనలో శిక్షణ తీసుకోవడం, అన్ని విషయాల గురించి తెలుసుకోవడం వల్ల చిత్రీకరణ సమయంలో ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు అంటూ చెప్పుకొచ్చారు బెల్లంకొండ గణేష్.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.