Bandla Ganesh: టికెట్ రేట్లు పెంచుకోవడానికి మాత్రమే సీఎంగారు కావాలా..? బండ్లగణేష్ సంచలన ట్వీట్
పవన్ కళ్యాణ్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. కానీ బండ్లగణేష్ మాత్రం ఆయనకు భక్తుడు. కాగా నటుడిగా పదుల సంఖ్యలో సినిమాలు చేసిన బండ్ల గణేష్ నిర్మాతగా మారి చేసిన మొదటి సినిమా ఆంజనేయులు.
నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బండ్లగణేష్ ఇప్పుడు నిర్మాతగా మారి సినిమాలు చేస్తున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో కనిపించి ఆకట్టుకున్నారు బండ్ల గణేష్. పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అయిన బండ్ల గణేష్ .. సమయం దొరికినప్పుడల్లా ఆయనను తెగ పొగిడేస్తుంటారు. పవన్ కళ్యాణ్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. కానీ బండ్లగణేష్ మాత్రం ఆయనకు భక్తుడు. కాగా నటుడిగా పదుల సంఖ్యలో సినిమాలు చేసిన బండ్ల గణేష్ నిర్మాతగా మారి చేసిన మొదటి సినిమా ఆంజనేయులు. ఈ సినిమా తర్వాత తీన్ మార్ , గబ్బర్ సింగ్, బాద్ షా, ఇద్దరమ్మాయిలతో సినిమాలు చేశాడు. ఇక బండ్లగణేష్ రాజకీయాలను కూడా టచ్ చేశారు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బండ్లగణేష్ తన ట్వీట్స్ తో అందర్నీ ఆకట్టుకుంటూ ఉంటారు.
ఇది కూడా చదవండి : జర్నీ సినిమాలో నటించిన ఈ అమ్మాయి గుర్తుందా..? ఆమె ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..
సోషల్ మీడియాలో బండ్లగణేష్ చేసే పోస్ట్ లకు, ట్వీట్ లకు యమా క్రేజ్ ఉంటుంది. తాజాగా ఆయన సినిమా ప్రముఖులను ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. శుక్రవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టిన రోజు. దాంతో ఆయనకు పలువురు విషెస్ తెలిపారు. రాజకీయప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు కూడా సోషల్ మీడియా వేదికగా రేవంత్ రెడ్డికి విషెస్ తెలిపారు. అయితే కొంతమంది సినిమా వాళ్ళు రేవంత్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపలేదని బండ్లగణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయన ఓ ట్వీట్ షేర్ చేశారు.
ఇది కూడా చదవండి : మావా.. ఎవరో గుర్తుపట్టావా.? అప్పట్లో ఊపేసిన శాంతాబాయి.. ఇప్పుడు ఎలా ఉందంటే
“గౌరవ ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డిగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన సినీ ప్రముఖులందరికీ ధన్యవాదాలు. తెలియజేయడానికి సమయం లేని వారికి పెద్ద నమస్కారం. “టికెట్ రేట్లు పెంచుకోవడానికి మాత్రమే సీఎం గారు కావలెను” అని బండ్ల గణేష్ తన ఎక్స్ లో రాసుకొచ్చారు. ఇక 2018 తెలంగాణా ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశ్యంతో సెప్టెంబరులో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ టికెట్ దక్కలేదు. ఏప్రిల్ 5, 2019 న తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. కానీ ఆయన ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ మనిషిగానే ఉన్నారు.
గౌరవ ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డిగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన సినీ ప్రముఖులందరికీ ధన్యవాదాలు. తెలియజేయడానికి సమయం లేని వారికి పెద్ద నమస్కారం. “టికెట్ రేట్లు పెంచుకోవడానికి మాత్రమే సీఎం గారు కావలెను”.🙏 @revanth_anumula anna @TelanganaCMO
— BANDLA GANESH. (@ganeshbandla) November 9, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.