Bandla Ganesh: ‘నా టైటిల్ కొట్టేశారు’.. ఎన్టీఆర్ సినిమాపై బండ్ల గణేష్ సంచలన ట్వీట్..
ఈ మూవీ టైటిల్ దేవర అని ఫిక్స్ చేసినట్లుగా కొద్ది రోజులుగా టాక్ వినిపిస్తుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించినప్పటికీ ఆల్ మోస్ట్ ఇదే టైటిల్ ఫిక్స్ అయ్యిందని ఫిల్మ్ వర్గాల్లో న్యూస్ వైరలవుతుంది. ఈ క్రమంలోనే నా టైటిల్ కొట్టేశారంటూ నిర్మాత బండ్ల గణేష్ ట్వీట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దేవర అనే టైటిల్ తను రిజిస్ట్రేషన్ చేయించుకున్నానని.. అది నా టైటిల్ అంటూ వరుసగా ట్వీట్స్ చేశారు బండ్ల గణేష్.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పవర్ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా రూపొందుతున్న ఈమూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈ సినిమాతో జాన్వీ తెలుగు తెరకు పరిచయం కాబోతుండగా.. ప్రతినాయకుడిగా హీరో సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. గత కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తారక్ బర్త్ డే సందర్భంగా మే 19న సాయంత్రం 7 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈక్రమంలోనే ఈ మూవీ టైటిల్ పై ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఈ మూవీ టైటిల్ దేవర అని ఫిక్స్ చేసినట్లుగా కొద్ది రోజులుగా టాక్ వినిపిస్తుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించినప్పటికీ ఆల్ మోస్ట్ ఇదే టైటిల్ ఫిక్స్ అయ్యిందని ఫిల్మ్ వర్గాల్లో న్యూస్ వైరలవుతుంది. ఈ క్రమంలోనే నా టైటిల్ కొట్టేశారంటూ నిర్మాత బండ్ల గణేష్ ట్వీట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దేవర అనే టైటిల్ తను రిజిస్ట్రేషన్ చేయించుకున్నానని.. అది నా టైటిల్ అంటూ వరుసగా ట్వీట్స్ చేశారు బండ్ల గణేష్.
“దేవర.. నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్న నా టైటిల్. నేను మర్చిపోవడం వల్ల.. నా టైటిల్ కొట్టేశారు” అని పేర్కొన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికి..’నాకేం ప్రాబ్లం లేదు బ్రదర్.. ఇది మన యంగ్ టైగర్ సినిమాకే కదా.. ఆయన కూడా నాకు దేవరే.. ‘ అంటూ మరో ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్స్ విభిన్నంగా స్పందిస్తున్నారు.




ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవల రక్తంతో రాసిన అతని కథలతో సముద్రం నిండి ఉంది అంటూ మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేయగా.. ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
నాకేం ప్రాబ్లం లేదు బ్రదర్ ఇది మన యంగ్ టైగర్ సినిమాకే కదా ఆయన కూడా నాకు దేవరే ❤️ https://t.co/Ad1wIqIfYB
— BANDLA GANESH. (@ganeshbandla) May 19, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.