Megastar Chiranjeevi: సినిమా ప్లాప్.. అయినా కోట్లు రాబట్టింది.. చిరు క్రేజ్ అంటే అట్లుంటది మరీ..

ఇప్పటికే వాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ హిట్ అందుకున్న చిరు.. ఇప్పుడు భోళా శంకర్ మూవీతో బిగ్ స్క్రీన్ పై సందడి చేయబోతున్నారు. ఒకప్పుడు చిరు నటించిన సినిమాలకు హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా అదిరిపోయే కలెక్షన్స్ వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి.

Megastar Chiranjeevi: సినిమా ప్లాప్.. అయినా కోట్లు రాబట్టింది.. చిరు క్రేజ్ అంటే అట్లుంటది మరీ..
Chiranjeevi
Follow us

|

Updated on: May 19, 2023 | 6:44 PM

తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి ఓ ప్రత్యేక అధ్యయం. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్టార్ అయ్యారు. స్వయం కృషితో స్టార్ డమ్ సంపాదించుకోవడమే కాకుండా.. సినీరంగంలోకి అడుగుపెట్టాలనుకుంటున్న ఎంతో మందికి స్పూర్తిదాయకంగా నిలిచారు. చిరు సినిమా వచ్చిదంటే ఇప్పటికీ హౌస్ ఫుల్ అవ్వాల్సింది. ఆరు పదుల వయసులోనూ ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీనిస్తూ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే వాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ హిట్ అందుకున్న చిరు.. ఇప్పుడు భోళా శంకర్ మూవీతో బిగ్ స్క్రీన్ పై సందడి చేయబోతున్నారు. ఒకప్పుడు చిరు నటించిన సినిమాలకు హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా అదిరిపోయే కలెక్షన్స్ వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి.

భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయిన సినిమాలు ఉన్నాయి. కానీ ప్లాప్ టాక్ అందుకుని… రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టిన స్టామినా కేవలం చిరంజీవికి సొంతం. చిరు కెరీర్ లో బాక్సాఫీస్ వద్ద పరాజయం చెందిన చిత్రాల్లో మృగరాజు ఒకటి. ఈ మూవీకి గుణశేఖర్ దర్శకత్వం వహించగా.. ఇందులో చిరు సరసన సిమ్రాన్ నటించింది. భారీ అంచనాల నడుమ 2001లో విడుదలైన ఈ మూవీ మొదటి షోకే బాక్సాఫీస్ వద్ద ప్లాప్ టాక్ వచ్చింది.

ఇవి కూడా చదవండి

కానీ అప్పుడే అనేక సెంటర్లలో ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ రాబట్టింది. అలాగే ఈ మూవీ మొత్తం బాక్సాఫీస్ రన్ ముగిసే సరికి కూడా సూపర్ సాలిడ్ కలెక్షన్స్ వసూలు చేసింది. అప్పుడే ఈ సినిమా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రూ. 14 కోట్ల షేర్ రాబట్టిందట. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించగా.. ఇందులో చిరు, సిమ్రాన్ కెమిస్ట్రీ మెప్పించింది.