Agent Movie: ఏజెంట్ స్ట్రీమింగ్ వాయిదా పై స్పందించిన ఓటీటీ సంస్థ.. రిలీజ్ ఎప్పుడంటే..

సమంత నటించిన శాకుంతలం నుంచి.. ఇటీవల అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ వరకు..ప్రమోషన్లతో హైప్ క్రియేట్ చేసినప్పటికీ తొలి రోజే ప్లాప్ టాక్ అందుకున్నాయి. ఇక అంతే త్వరగా ఓటీటీలోకి వచ్చేశాయి. అయితే ఏజెంట్ విషయంలో మాత్రం అలా జరగలేదు. మే 19న ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కావాల్సిన ఈ చిత్రం ఎక్కడ కనిపించలేదు.. దీంతో ఓటీటీలో ఈ సినిమా చూద్ధామనుకునేవారికి నిరాశే ఎదురైంది.

Agent Movie: ఏజెంట్ స్ట్రీమింగ్ వాయిదా పై స్పందించిన ఓటీటీ సంస్థ.. రిలీజ్ ఎప్పుడంటే..
Agent
Follow us
Rajitha Chanti

|

Updated on: May 19, 2023 | 5:04 PM

ఇటీవల కొద్దిరోజులుగా ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద పలు చిత్రాలు డిజాస్టర్స్ అవుతున్నాయి. భారీగా బడ్జెట్ పెట్టి.. స్టార్ హీరోలతో సినిమాలు తెరకెక్కించినా.. కంటెంట్ లేకపోతే పక్కన పెట్టేస్తున్నారు ఆడియన్స్. ఇన్నాళ్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస డిజాస్టర్స్ కాగా.. ఇప్పుడు తెలుగులోనూ పలు చిత్రాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. సమంత నటించిన శాకుంతలం నుంచి.. ఇటీవల అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ వరకు..ప్రమోషన్లతో హైప్ క్రియేట్ చేసినప్పటికీ తొలి రోజే ప్లాప్ టాక్ అందుకున్నాయి. ఇక అంతే త్వరగా ఓటీటీలోకి వచ్చేశాయి. అయితే ఏజెంట్ విషయంలో మాత్రం అలా జరగలేదు. మే 19న ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కావాల్సిన ఈ చిత్రం ఎక్కడ కనిపించలేదు.. దీంతో ఓటీటీలో ఈ సినిమా చూద్ధామనుకునేవారికి నిరాశే ఎదురైంది.

ఇక ఇదే విషయమై సోషల్ మీడియా వేదికగా ఓటీటీ సంస్థ సోనీ లివ్ ను ప్రశ్నిస్తూ వరుస ట్వీట్స్ చేశారు నెటిజన్స్. దీంతో దిగొచ్చిన సోనీ లివ్.. సినీ ప్రియులకు వివరణ ఇస్తూ ట్వీట్ చేసింది. “ప్రస్తుతం ఏజెంట్ చిత్రం అందుబాటులో లేదు. ఎప్పటికప్పుడు తాజాగా అప్డేట్స్ కోసం దయచేసి మా సోషల్ మీడియా అకౌంట్లను అనుసరించండి. అఖిల్, మమ్ముటి నటించిన యాక్షన్‌ ప్యాక్డ్‌ థ్రిల్లర్‌ రైడ్‌ ఏజెంట్ త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది” అంటూ ట్వీట్ చేసింది. అయితే రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించలేదు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను మే 26న స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అక్కినేని అఖిల్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ చిత్రం ఏజెంట్. ఇందులో సాక్షి వైద్య కథానాయికగా నటించింది. ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆక్టటుకోలేకపోయింది. దీంతో విడుదలైన మూడు వారాలకే ఈ సినిమా ఓటీటీ విడుదల చేస్తున్నట్లు ప్రకటించడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఏజెంట్ ఓటీటీ స్ట్రీమింగ్ మరో వారం ఆగినట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.