Agent OTT: అఖిల్‌ ఫ్యాన్స్‌కు బిగ్‌ షాక్‌.. ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రాని ఏజెంట్ సినిమా.. కారణమేంటంటే?

ఏజెంట్ సినిమా డిజిటల్‌ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ సోనీ లివ్ మంచి ఫ్యాన్సీ రేటుకు కొనుగోలు చేసింది. అదే సమయంలో థియేటర్లలో నిరాశపర్చిన ఏజెంట్‌ను ఇవాల్టి (మే19) నుంచే స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. అంటే అర్ధరాత్రి నుంచే అఖిల్‌ సినిమా స్ట్రీమింగ్ రావాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు ఏజెంట్ మూవీ స్ట్రీమింగ్‌కు రాలేదు.

Agent OTT: అఖిల్‌ ఫ్యాన్స్‌కు బిగ్‌ షాక్‌.. ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రాని ఏజెంట్ సినిమా.. కారణమేంటంటే?
Akhil Akkineni's Agent
Follow us
Basha Shek

|

Updated on: May 19, 2023 | 8:46 AM

అక్కినేని యంగ్‌ హీరో అఖిల్‌ నటించిన తాజా చిత్రం ఏజెంట్. స్పై థ్రిల్లర్‌ కథాంశంతో స్టైలిష్‌ దర్శకుడు సురేందర్‌ రెడ్డి ఈ మూవీని తెరకెక్కించారు. . సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించింది. విడుదలకు ముందు భారీ అంచనాలు క్రియేట్‌ చేసిన ఏజెంట్ తీరా థియేటర్లలోకి అడుగుపెట్టాక పూర్తిగా నిరాశపర్చింది. ఏప్రిల్‌ 28న విడుదలైన ఏజెంట్ మూవీకి మొదటి నుంచి డిజాస్టర్‌ టాక్‌ తెచ్చుకుంది. ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయింది. ఏజెంట్ ఫెయిల్యూర్‌పై నిర్మాత అనిల్ సుంకర బహిరంగ ప్రకటన కూడా విడుదల చేశారు. హీరో అఖిల్‌ కూడా ప్రేక్షకులకు క్షమాపణ చెప్పాడు. కాగా ఏజెంట్ సినిమా డిజిటల్‌ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ సోనీ లివ్ మంచి ఫ్యాన్సీ రేటుకు కొనుగోలు చేసింది. అదే సమయంలో థియేటర్లలో నిరాశపర్చిన ఏజెంట్‌ను ఇవాల్టి (మే19) నుంచే స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. అంటే అర్ధరాత్రి నుంచే అఖిల్‌ సినిమా స్ట్రీమింగ్ రావాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు ఏజెంట్ మూవీ స్ట్రీమింగ్‌కు రాలేదు. దీంతో సినిమా ఎక్కడా అని ప్రశ్నిస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్.

మరోవైపు ఫ్యాన్స్‌ కామెంట్లపై స్పందించిన సోనిలవ్‌ మాత్రం ఇంకా వేచి చూడండని చెబుతోంది. అయితే ప్రస్తుతమున్న సమాచార మేరకు అఖిల్‌ ఓటీటీ స్ట్రీమింగ్ ను మరోసారి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. థియేటర్‌ రిలీజ్‌కు, ఓటీటీ విడుదలకు కనీసం 20 రోజుల గ్యాప్‌ కూడా లేకపోవడంతో మరో వారం పాటు పోస్ట్ పోన్‌ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయంలో ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా అఖిల్‌ సినిమాను ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మించగా.. వక్కంతం వంశీ కథను అందించాడు. మమ్ముట్టి, డినో మోరియా ప్రధాన పాత్రలు పోషించారు. ఇక హిప్ హాప్ తమీజా ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..