AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajinikanth: 3 వేల నుంచి 270 కోట్ల వరకు.. బాక్సాఫీస్ ‘కూలీ’ రజనీకాంత్ ప్రస్థానం! ఒకే సినిమాకు రూ. 200 కోట్లా?

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో 'సూపర్ స్టార్' అనే పదానికి నిలువెత్తు రూపం రజనీకాంత్. ఐదు దశాబ్దాలుగా వెండితెరను ఏలుతున్న ఈ లెజెండ్, బాక్సాఫీస్ వద్ద సృష్టించే ప్రకంపనలు సామాన్యమైనవి కావు. ఒకప్పుడు కేవలం రూ. 3000 పారితోషికంతో మొదలైన ఆయన ప్రయాణం, నేడు వందల కోట్ల సామ్రాజ్యానికి చేరుకుంది.

Rajinikanth: 3 వేల నుంచి 270 కోట్ల వరకు.. బాక్సాఫీస్ ‘కూలీ’ రజనీకాంత్ ప్రస్థానం! ఒకే సినిమాకు రూ. 200 కోట్లా?
Rajiinikanth
Nikhil
|

Updated on: Mar 09, 2026 | 6:00 AM

Share

శివాజీ రావు గైక్వాడ్‌గా మొదలై, రజనీకాంత్‌గా మారి, నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న ఒకే ఒక్కడు ‘తలైవర్’. కేవలం తమిళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా, భారతీయ సినిమా గమనాన్ని మార్చిన నటుడు ఆయన. వయసు పెరుగుతున్నా కొద్దీ ఆయన క్రేజ్ మరియు పారితోషికం తగ్గకపోగా, ఆకాశాన్ని తాకుతున్నాయి. చివరగా విడుదలైన ‘కూలీ’ సినిమా వసూళ్లు, ఆయన రెమ్యూనరేషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్.

కూలీ సినిమా సంచలనం..

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో 2025లో విడుదలైన ‘కూలీ’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 518 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది. ఈ సినిమా కోసం రజనీకాంత్ ఏకంగా రూ. 200 కోట్ల పారితోషికం అందుకున్నట్లు సమాచారం. నిజానికి ఆయన పారితోషికం రూ. 150 కోట్లుగా నిర్ణయించినప్పటికీ, అడ్వాన్స్ బుకింగ్స్‌లో వచ్చిన భారీ రెస్పాన్స్ చూసి దానిని రూ. 200 కోట్లకు పెంచినట్లు ఇండస్ట్రీ టాక్. దీనికి ముందు వచ్చిన ‘వేట్టయాన్’ కోసం ఆయన రూ. 125 కోట్లు తీసుకున్నారు.

అంచెలంచెలుగా ఎదిగి..

1975లో ‘అపూర్వ రాగంగళ్’ సినిమాతో అరంగేట్రం చేసినప్పుడు రజనీకాంత్ అందుకున్న పారితోషికం కేవలం రూ. 3000 నుండి రూ. 3500 మాత్రమే. నేడు ఆయన ఒక్కో సినిమాకు రూ. 125 కోట్ల నుంచి రూ. 270 కోట్ల వరకు వసూలు చేస్తున్నారు. ఒక నటుడి విలువ 50 ఏళ్ల తర్వాత కూడా ఇలా పెరుగుతూ పోవడం భారతీయ చిత్ర పరిశ్రమలో రజనీకాంత్‌కు మాత్రమే సాధ్యమైంది.

Rajinikanth1

Rajinikanth1

రజనీకాంత్ అభిమానులకు రాబోయే రోజుల్లో పండగే అని చెప్పాలి. ప్రస్తుతం ఆయన నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ‘జైలర్ 2’ చిత్రంలో నటిస్తున్నారు. ఇది ఆగస్టు 14, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అంతేకాకుండా, మరో సంచలన ప్రాజెక్ట్ కూడా సిద్ధమవుతోంది.

తమిళ చిత్ర పరిశ్రమలోని ఇద్దరు దిగ్గజాలు రజనీకాంత్ మరియు కమల్ హాసన్ దాదాపు 46 ఏళ్ల తర్వాత ఒకే స్క్రీన్‌పై కనిపించబోతున్నారు. ‘తలైవర్ 173 x KH 238’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందనున్న ఈ చిత్రానికి నెల్సన్ దర్శకత్వం వహించనుండగా, అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఫలితాలతో సంబంధం లేకుండా రజనీకాంత్ అనే పేరు బాక్సాఫీస్ వద్ద ఒక బ్రాండ్. బస్ కండక్టర్ స్థాయి నుంచి గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన ఆయన ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. రాబోయే ‘జైలర్ 2’, కమల్ హాసన్‌తో కలయిక భారతీయ సినిమా చరిత్రలో కొత్త రికార్డులను తిరగరాయడం ఖాయం.

Follow Us
నేనెప్పుడు ఇంతలా భావోద్వేగానికి గురికాలేదు.. రష్మిక ఎమోషనల్..
నేనెప్పుడు ఇంతలా భావోద్వేగానికి గురికాలేదు.. రష్మిక ఎమోషనల్..
మొక్కలు ఏపుగా పెరగాలంటే ఈ ఒక్కటి చాలు.. మీ గార్డెన్ బంగారమే!
మొక్కలు ఏపుగా పెరగాలంటే ఈ ఒక్కటి చాలు.. మీ గార్డెన్ బంగారమే!
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. మరో నగరానికి ఔటర్ రింగ్ రోడ్డు..
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. మరో నగరానికి ఔటర్ రింగ్ రోడ్డు..
మారిన ఆధార్ కార్డు అప్డేట్ రూల్స్.. యాప్ నుంచి అన్నీ సేవలు
మారిన ఆధార్ కార్డు అప్డేట్ రూల్స్.. యాప్ నుంచి అన్నీ సేవలు
పృథ్వీ షా మనసు దోచిన ముద్దుగుమ్మ తెలుగు హీరోయిన్ అంట
పృథ్వీ షా మనసు దోచిన ముద్దుగుమ్మ తెలుగు హీరోయిన్ అంట
ఉగాది తర్వాత.. ఆ రాశుల వారి ఇళ్లలో పెళ్లి బాజాలు..!
ఉగాది తర్వాత.. ఆ రాశుల వారి ఇళ్లలో పెళ్లి బాజాలు..!
మీ జాతకంలో కుజ దోషం ఉందా..? మంగళ చండీదేవి పూజతో వివాహ యోగం ఖాయం!
మీ జాతకంలో కుజ దోషం ఉందా..? మంగళ చండీదేవి పూజతో వివాహ యోగం ఖాయం!
ఆమె గొప్ప హీరోయిన్.. ఎందుకు సినిమాలను వదిలేసిందో..
ఆమె గొప్ప హీరోయిన్.. ఎందుకు సినిమాలను వదిలేసిందో..
మీన రాశిలో రవి..ఆస్తి, ఆర్థిక విషయాల్లో ఈ రాశుల వారు జాగ్రత్త!
మీన రాశిలో రవి..ఆస్తి, ఆర్థిక విషయాల్లో ఈ రాశుల వారు జాగ్రత్త!
వ్యవసాయం కాదు..పాముల పెంపకంతో కోట్లు సంపాదిస్తున్న రైతులు..
వ్యవసాయం కాదు..పాముల పెంపకంతో కోట్లు సంపాదిస్తున్న రైతులు..