Veera Simha Reddy : కుమ్మేస్తున్న వీరసింహ రెడ్డి.. ఆరు రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే..
ఈ సినిమాలో బాలకృష్ణ మరోసారి పవర్ ఫుల్ పాత్రలో కనిపించి మెప్పించారు. ఈ సినిమాలో బాలయ్య సరసన అందాల భామ శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించింది. అలాగే మలయాళీ ముద్దుగుమ్మ హనీ రోజ్ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.

నటసింహం సింహం నందమూరి బాలకృష్ణ నటించిన మూవీ వీరసింహారెడ్డి. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. మాస్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో బాలకృష్ణ మరోసారి పవర్ ఫుల్ పాత్రలో కనిపించి మెప్పించారు. ఈ సినిమాలో బాలయ్య సరసన అందాల భామ శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించింది. అలాగే మలయాళీ ముద్దుగుమ్మ హనీ రోజ్ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మించారు. వీరసింహారెడ్డి సినిమా మొదటి రోజు మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. తొలి రోజు ఈ సినిమా ఏకంగా 32 కోట్ల రూపాయలను నెట్ వసూల్ చేసింది.
ఇక ఈ సినిమా విడుదలై 6 రోజులు పూర్తయింది. ఆరు రోజులకు గాను వీరసింహారెడ్డి సినిమాకు ఎంత కలెక్షన్స్ వచ్చాయంటే.. నైజాం 14.63 కోట్లు, సీడెడ్ 14.49 కోట్లు, ఉత్తరాంధ్ర 5.79 కోట్లు, ఈస్ట్ 4.53 కోట్లు, వెస్ట్ 3.55 కోట్లు, గుంటూరు 5.70 కోట్లు, కృష్ణా 3.90 కోట్లు, నెల్లూరు 2.37 కోట్లు, ఏపీ – తెలంగాణ కలిపి 54.96 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 4.29 కోట్లు, ఓవర్సీస్ 5.40 కోట్లు, వరల్డ్ వైడ్ గా 64.65 కోట్లు షేర్ సాధించింది ఈ మూవీ.




6 రోజులు పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.64.65 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు ఇంకో రూ.3.35 కోట్ల షేర్ ను రాబట్టాలి. రానున్న రోజుల్లో కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.




