Veera Simha Reddy: దూకుడు మీదున్న వీరసింహారెడ్డి.. కలెక్షన్ల వర్షం కురిపిస్తోన్న బాలయ్య సినిమా
గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలకృష్ణ మరోసారి తన నటవిశ్వరూపాన్ని చూపించారు. ఫైట్స్, డైలాగ్ , బాలయ్య డ్యాన్స్, సెంటి మెంట్ ఇలా అన్ని హంగులతో రుపొంచిన వీరసింహారెడ్డి సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ వీరసింహారెడ్డి. ఫ్యాక్షన్ సినిమాకు బాలయ్య పెట్టింది పేరు అని మరోసారి నిరూపించింది ఈ సినిమా. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలకృష్ణ మరోసారి తన నటవిశ్వరూపాన్ని చూపించారు. ఫైట్స్, డైలాగ్ , బాలయ్య డ్యాన్స్, సెంటి మెంట్ ఇలా అన్ని హంగులతో రుపొంచిన వీరసింహారెడ్డి సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ అన్ని ఏరియాలనుంచి ట్రెమండర్స్ రెస్పాండ్స్ ను సొంతం చేసుకుంది. అలాగే ఈ సినిమా కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది.
ఇప్పటికే 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది వీరసింహారెడ్డి. సినిమా రిలీజ్ కు ముందే తమన్ సంగీతంలో రూపొందిన పాటలు, టీజర్, ట్రైలర్ వంటివి ప్రేక్షకులను అలరించడంతో ఈ సినిమాకి హైప్ పెరిగింది.
ఇక ఈ సినిమా జనవరి 19న ఈ సినిమా 2.50కోట్లను నెట్ కలెక్షన్స్ ను సాధించింది. 8 రోజులు పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.69.69 కోట్ల షేర్ ను రాబట్టి ఓవరాల్ గా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసింది. ఇక 9వ రోజు వీరసింహారెడ్డి సినిమా మొత్తంగా 371.66 తెలుగు ఆక్యుపెన్సీ కలిగిఉంది. దాంతో ఈస్ట్, వెస్ట్, కృష్ణా, ఉత్తరాంధ్ర వంటి ఏరియాల బయ్యర్స్ మరో రెండు రోజుల్లో లేదా సెకండ్ వీకెండ్ కు సేఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.



