AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: బాలయ్య షోలో బాహుబలి ధరించిన షర్ట్‌ ధరెంతో తెలుసా? బాప్‌ రే.. సింపుల్‌ గా ఉన్నా అంత రేటా?

సాధారణంగా ప్రభాస్‌ టీవీ షోలు, టాక్‌షోలకు చాలా దూరంగా ఉంటారు. అటువంటి ఆయన బాలయ్య టాక్ షోలో పాల్గొనడం కొంచెం ఆశ్చర్యకరమైన విషయమే. దీంతో బాహుబలి ఫ్యాన్స్ అంతా ఈ ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Prabhas: బాలయ్య షోలో బాహుబలి ధరించిన షర్ట్‌ ధరెంతో తెలుసా? బాప్‌ రే.. సింపుల్‌ గా ఉన్నా అంత రేటా?
Balakrishna, Prabhas
Basha Shek
|

Updated on: Dec 13, 2022 | 3:43 PM

Share

నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే సీజన్‌-2 సక్సెస్‌ ఫుల్‌గా దూసుకెళుతోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో ప్రసారమవుతోన్న ఈ టాక్‌షో మొదటి సీజన్‌కు మించి ఆదరణ దక్కించుకుంటోంది. సినిమా, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ ఛాట్‌షోలో పాల్గొని సందడి చేశారు. ఇదిలా ఉంటే తాజా ఎపిసోడ్‌కు పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హాజరయ్యారు. తన క్లోజ్‌ ఫ్రెండ్‌ మ్యాచో స్టార్‌ గోపిచంద్‌తో కలిసి అన్‌స్టాపబుల్‌ షోలో పాల్గొన్నాడు. కాగా సాధారణంగా ప్రభాస్‌ టీవీ షోలు, టాక్‌షోలకు చాలా దూరంగా ఉంటారు. అటువంటి ఆయన బాలయ్య టాక్ షోలో పాల్గొనడం కొంచెం ఆశ్చర్యకరమైన విషయమే. దీంతో బాహుబలి ఫ్యాన్స్ అంతా ఈ ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కాగా ఇప్పటికే బాహుబలి ఎపిసోడ్ షూటింగ్ పూర్తి కావడంతో ఆహా టీమ్‌ ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. ఈ షోలో సరికొత్త హెయిర్‌ స్టైల్‌, కాస్త పెరిగిన గడ్డంతో ఎంతో హ్యాండ్‌సమ్‌గా కనిపించాడు డార్లింగ్‌. కాగా బయటకొచ్చినప్పుడు ఎక్కువగా బ్లాక్‌ డ్రెస్సులో కనిపించే బాహుబలి బాలయ్య టాక్‌షోకు కలర్‌ఫుల్‌ డ్రెస్‌లో హాజరయ్యాడు. ముఖ్యంగా షర్ట్‌ అందరినీ ఆకట్టుకుంది. దీంతో బాసుబలి వేసుకున్న షర్ట్‌ ఏ బ్రాండ్‌? దాని ధరెంత అంటూ నెటిజన్లు తెగ వెదికేశారు. వివరాల ప్రకారం.. ప్రభాస్‌ వేసుకున్న షర్ట్‌ ‘పోలో రాల్ఫ్ లారెన్ మెన్స్ మద్రాస్ బటన్ డౌన్’ కంపెనీకి చెందినదట. దీని ధర సుమారు 115 పౌండ్స్‌ ఉంటుందట. అంటే భారతీయ కరెన్సీలో దాదాపు 11,618 రూపాయలన్న మాట. దీనిని చూసి ఫ్యాన్స్‌ షాక్‌ అవుతున్నారు. సింపుల్‌గా కనిపిస్తున్న ఈ షర్ట్‌ ఇంత రేటా? అని ఆశ్చర్యపోతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..