AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pia Bajpiee: సమంత లాగే నేనూ మయోసైటిస్‌తో బాధపడుతోన్నా.. షాకింగ్‌ విషయం బయటపెట్టిన హీరోయిన్‌

సామ్‌ తర్వాత మరో టాలీవుడ్‌ నటి కల్పికా గణేశ్‌ కూడా మయోసైటిస్‌తో బాధపడుతున్నట్లు తెలిపి షాక్‌ ఇచ్చింది. తాజాగా తాను కూడా మయోసైటిస్‌ వ్యాధితో పోరాడినట్లు రంగం ఫేమ్‌ హీరోయిన్‌ పియా బాజ్‌పేయ్‌ తెలిపింది. '

Pia Bajpiee: సమంత లాగే నేనూ మయోసైటిస్‌తో బాధపడుతోన్నా.. షాకింగ్‌ విషయం బయటపెట్టిన హీరోయిన్‌
Actress Pia Bajpiee
Basha Shek
|

Updated on: Dec 13, 2022 | 4:26 PM

Share

స్టార్‌ హీరోయిన్‌ సమంత ప్రస్తుతం మయోసైటిస్‌తో బాధపడుతోంది. కొన్ని రోజుల క్రితమే ఈ విషయాన్ని బయటపెట్టి అందరికీ షాక్‌ ఇచ్చింది సామ్‌. ఆటో ఇమ్యూన్‌ సమస్య కారణంగా వచ్చే ఈ వ్యాధి వల్ల కండరాల నొప్పులు తీవ్రంగా ఉంటాయి. కొన్నిసార్లు కదల్లేని పరిస్థితి కూడా తలెత్తుతంది. ఆటో ఇమ్యూన్‌తో పాటు వైరస్‌ల ప్రభావం, అతిగా మందులు వాడడం వల్ల మయోసైటిస్‌ వస్తుంది. దీని కోసం కేరళ ఆయుర్వేద చికిత్స కూడా తీసుకుంటోంది సామ్‌. కాగా సామ్‌ తర్వాత మరో టాలీవుడ్‌ నటి కల్పికా గణేశ్‌ కూడా మయోసైటిస్‌తో బాధపడుతున్నట్లు తెలిపి షాక్‌ ఇచ్చింది. తాజాగా తాను కూడా మయోసైటిస్‌ వ్యాధితో పోరాడినట్లు రంగం ఫేమ్‌ హీరోయిన్‌ పియా బాజ్‌పేయ్‌ తెలిపింది. ‘సమంత పరిస్థితిని అర్థం చేసుకోగలను. ఎందుకంటే నేను కూడా గతంలో మయోసైటిస్‌ బారిన పడ్డాను. చికిత్స లేని వ్యాధి బారిన పడితే వాళ్ల మానసిక స్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోగలను. దీని గురించిన ఆలోచనలు కూడా చాలా భయానకంగా ఉంటాయి. మనం వాడే మందులు దీనిని అదుపులో మాత్రమే ఉంచుతాయి’

ఆ విషయం తెలిసి భయపడిపోయా..

‘2016లో అనుకుంటా.. ఒకసారి నా పాదంలో వాపు గమనించాను. జిమ్‌లో ఏదైనా దెబ్బతగిలిందేమో అనుకున్నాను. కానీ మరుసటి రోజు నిద్ర లేచే సరికి మరో పాదంలో కూడా వాపు వచ్చింది. కూర్చోలేక నిలబడలేక నొప్పితో విలవిల్లాడిపోయాను. వెంటనే డాక్టర్‌ వద్దకు వెళ్లాను. ఈ వ్యాధి గురించి మొదట డాక్టర్ నాకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించారు. దీంతో నేను మొదట్లో భయపడలేదు. అయితే ఎప్పుడైతే ఆన్‌లైన్లో మయోసైటిస్‌ దాని లక్షణాలు, ఎఫెక్ట్‌ గురించి చదివానో పూర్తిగా భయపడిపోయాను. అప్పటికి నేను ముంబైలో ఒంటరిగా ఉన్నాను. భయపడతారేమోనని మా కుటుంబ సభ్యులకు కూడా ఈ విషయాన్ని తెలియజేయలేదు. ఢిల్లీలోని ఎయిమ్స్‌కు వెళ్లి మరోసారి పరీక్షలు చేయించుకున్నాక నాకు మయోసైటిస్‌ ఉందని నిర్ధారణ అయ్యింది. దీంతో నేను భయపడిపోయాను. భవిష్యత్‌లో ఏం జరుగుతుందోనని మనసులోనే కుమిలిపోయాను. అయితే ముంబైలో ఉండి చికిత్స తీసుకున్నా. సమంతకు మయోసైటిస్‌ ఉందని తెలియగానే చాలా బాధపడ్డాను. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’ అని చెప్పుకొచ్చింది పియా బాజ్‌పేయి పేర్కొంది.

ఇవి కూడా చదవండి

రంగం సినిమాతో గుర్తింపు

నిన్ను కలిశాక సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన పియా బాజ్‌పాయ్‌ జీవా హీరోగా నటించిన రంగం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆతర్వాత బ్యాక్‌బెంచ్‌ స్టూడెంట్, దళం సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. ప్రస్తుతం తమిళ్‌,మలయాళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటోంది.

View this post on Instagram

A post shared by Pia Bajpiee (@piabajpai)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..