NBK 107: గోపీచంద్ మలినేని మూవీ నుంచి నటసింహం లుక్ వచ్చేసింది.. అదరగొట్టిన బాలయ్య
నట సింహం నందమూరి బాలకృష్ణ రీసెంట్ గా అఖండ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నారు. బోయపాటి శ్రీను బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ఇది.
NBK 107: నట సింహం నందమూరి బాలకృష్ణ రీసెంట్ గా అఖండ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నారు. బోయపాటి శ్రీను బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ఇది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు భారీ విజయాలను అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలను మించి అఖండ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ థియేటర్ల వద్ధ కాసుల వర్షం కురిపించింది. ప్రస్తుతం బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో బాలయ్య సరసన శ్రుతి హాసన్ నటిస్తోంది. ఇటీవలే ఈ మూవీ పూజా కార్యక్రమాలు జరుపుకుని ఘనంగా ప్రారంభమైంది. ఇక ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయ్యింది. ఈ సినిమాలో బాలయ్య కు జోడీగా అందాల భామ శ్రుతిహాసన్ నటిస్తుంది.
తాజాగా ఈ సినిమానుంచి బాలకృష్ణ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. బాలయ్య కోసం మాస్ మసాలా స్టోరీని సిద్ధం చేశారని తెలుస్తుంది. బాలయ్య107వ సినిమాగా పక్కా మాస్ కమర్షియల్ అంశాలతో ఈ భారీ చిత్రం రూపొందుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే సిరిసిల్ల టౌన్ (తెలంగాణ)లో ప్రారంభమైంది. ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్‌తో షూటింగ్‌ని మొదలుపెట్టారు మేకర్స్. బాలకృష్ణ – ఫైటర్స్‌పై చిత్రీకరించిన యాక్షన్ సీక్వెన్స్‌కు రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ కొరియోగ్రఫీ చేశారు. ఈ చిత్రంలో ప్రతి నాయకుడి పాత్ర ద్వారా కన్నడ నటుడు దునియా విజయ్ తెలుగు పరిశ్రమకు పరిచయమవుతున్నాడు. బాలకృష్ణ 107వ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలోని ఓ కీలక పాత్ర కోసం వరలక్ష్మీ ని ఎంపిక చేసుకున్నారు. నవీన్ ఎర్నేని, వై రవి శంకర్ సంయుక్తంగా అత్యంత భారీగా నిర్మిస్తున్న ఈ మూవీకి తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.
Nbk 107మరిన్ని ఇక్కడ చదవండి :