Prabhas : ‘ప్రభాస్ నువ్ తెచ్చిన క్వాంటిటీతో ఆర్మీకి భోజనం పెట్టవచ్చు’.. డార్లింగ్ ఆతిథ్యం చూసి బిగ్ బి షాక్

Tollywood: ప్రజంట్ బిగ్ బి, ప్రభాస్‌ కలిసి ప్రాజెక్ట్ కే అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.

Prabhas : 'ప్రభాస్ నువ్ తెచ్చిన క్వాంటిటీతో ఆర్మీకి భోజనం పెట్టవచ్చు'.. డార్లింగ్ ఆతిథ్యం చూసి బిగ్ బి షాక్
Prabhas Big B
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 21, 2022 | 4:46 PM

Amitabh Bachchan: ప్ర‌భాస్ రేంజ్‌ గురించి.. అతడి మంచి మనసు గురించి.. అతడు గెస్టులకు ఇచ్చే విలువ గురించి తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయ‌న‌తో కలిసి పనిచేసిన ఎంతోమంది కో స్టార్స్.. ప్రభాస్ ఆతిథ్యానికి ఫిదా అయిన విషయం తెలిసిందే. అతడి ఇంటి నుంచి తెప్పించే ఫుడ్‌ను బాహుబ‌లి మీల్స్(Bahubali Meals) అని సరదాగా పేర్కొంటూ ఉంటారు. ప్రభాస్ మూవీ షూటింగ్‌కి వెళ్తున్నారా..? అయితే ఒకరోజు ముందు నుంచే ఏమి తినకుండా వెళ్లండి అని కొందరు ఆర్టిస్టులు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారంటే.. మనోడు ఏ రేంజ్‌లో ఫుడ్ పెడతాడో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ప్ర‌భాస్ ఆతిథ్యం చూసి బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ ఒకింత షాక్‌కు గురయ్యారు. ప్రజంట్ బిగ్ బి, ప్రభాస్‌ కలిసి ప్రాజెక్ట్ కే(Project K) అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. హోటల్‌లో బస చేస్తున్న అమితాబ్‌ కోసం ప్రభాస్‌ తన ఇంటి నుంచి ప్రత్యేకంగా వంటలు చేయించి తెప్పించారు. ఆ వంటలు చూసే ఒకింత ఆశ్చర్యానికి లోనైన అమితాబ్.. తిన్న తర్వాత టేస్ట్‌కు మరింత ఫిదా అయ్యారు. ఈ విషయాన్ని బిగ్‌ బి ట్విట్టర్‌లో పంచుకున్నారు.

‘బాహుబలి ప్రభాస్‌… నీ అభిమానం కొలవలేనిది. నువ్వు తెచ్చిన భోజనం ఎంత రుచికరమైనదో చెప్పడం కష్టం. నువ్వు పంపిన క్వాంటిటీ చాలా అంటే చాలా ఎక్కువ. ఎంత ఎక్కువంటే సైన్యానికి భోజనం పెట్టవచ్చు. స్పెషల్‌ కుకీస్‌ చాలా రుచిగా ఉన్నాయి. నీ కాంప్లిమెంట్స్ అంత ఈజీగా జీర్ణం కావు’ అని పేర్కొన్నారు అమితాబ్.

గతంలో  శ్రద్ధాకపూర్‌, కృతిసనన్‌, పూజాహెగ్డే, శ్రుతిహాసన్‌, కరీనాకపూర్‌‌లు కూడా ప్రభాస్‌ విందు, ఆయనిచ్చే ఆతిథ్యం గురించి స్పెషల్‌గా సోషల్ మీడియాలో ప్రస్తావించిన విషయం తెలిసిందే.

Also Read: పొట్లకాయ, గుడ్డు కలిపి వండితే పాయిజన్ అవుతుందా? ఇదిగో క్లారిటీ

తొక్కే కదా అని తీసిపారేయకండి.. దానితో లెక్కలేనన్ని ప్రయోజనాలు

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..