Akhanda Movie: అనంతపురంలో అఖండ బెనిఫిట్ షో.. బాలయ్య, బోయపాటి కాంబోలో హ్యాట్రిక్ హిట్ అంటున్న ఫ్యాన్స్..
Akhanda Movie: కరోనా వైరస్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన అఖండ సినిమా వాయిదాపడుతూ వచ్చింది. పరిస్థితులు మళ్ళీ అదుపులోకి వస్తున్న..
Akhanda Movie: కరోనా వైరస్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన అఖండ సినిమా వాయిదాపడుతూ వచ్చింది. పరిస్థితులు మళ్ళీ అదుపులోకి వస్తున్న నేపథ్యంలో బాలయ్య తాజా సినిమా అఖండ డిసెంబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. అఖండ సినిమా రిలీజ్ సందర్భంగా తెలుగురాష్ట్రాల్లో తెల్లవారు జామునుంచే సందడి మొదలైంది. ఆంధ్రప్రదేశ్ లో బాలయ్య అభిమానులు సినీ థియేటర్స్ వద్ద సందడి చేస్తున్నారు.
అఖండ సినిమా రిలీజ్ సందర్భంగా అనంతపురం జిల్లాలో బాలక్రిష్ణ అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. ఇవాళ ఉదయం 5గంటలకు బెన్ఫిట్ షో చూసిన అనంతరం అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. గౌరీ థియేటర్ కాంప్లెక్స్ ఇవాళ సినిమా చూసిన తరువాత బాలక్రిష్ణ అభిమాన సంఘం నాయకులు, మాజీ గ్రంథాలయ ఛైర్మన్ గౌస్ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. అనంతరం థియేటర్ వద్ద కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. థియేటర్ ప్రాంగణం మొత్తం అభిమానులతో కిక్కిరిసిపోయింది. బాణా సంచా కాలుస్తు డబ్బులు కొడుతూ అభిమానులు సందడి చేశారు. అఖండ సినిమాలో బాలక్రిష్ణ యాక్షన్ చూస్తే పూనకాలే అంటూ అభిమానులు చెబుతున్నారు. ఈసినిమా గతంలో ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని గౌస్ అన్నారు… బాలయ్య బోయపాటి కాంబోలో తెరకెక్కిన అఖండ హ్యాట్రిక్ హిట్ గ్యారెంటీ అంటున్నారు.
#akhanda celebrations begins ??#Balakrishna | #NandamuriBalakrishna pic.twitter.com/IQYOxsa3j9
— NakkaToka (@nakkatoka) December 1, 2021
#AkhandaMassJathara Started ? London uk?? pic.twitter.com/84EGU406VY
— Balayya Trends (@NBKTrends) December 1, 2021
Dallas gadda balayya babu addaaaa ??? #Akhanda Ap/TG range FDFS ra babu ? pic.twitter.com/1VlEM1hd6U
— Tony (@naren_mekala) December 2, 2021
Also Read: కుర్రకారు కలల రాణి.. ఆమె పేరు ఓ సమ్మోహనాస్త్రం.. చెరిగిపోని స్వప్నం.. సిల్క్ స్మిత జయంతి నేడు..