Akhanda : బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.. అఖండ నుంచి లేటేస్ట్ అప్డేట్ మీకోసమే..

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం అఖండ. ఇందులో బాలయ్య సరసన కంచె ఫేమ్.. ప్రగ్యా

Akhanda : బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.. అఖండ నుంచి లేటేస్ట్ అప్డేట్ మీకోసమే..
Akhanda


నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం అఖండ. ఇందులో బాలయ్య సరసన కంచె ఫేమ్.. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‍గా నటిస్తుండగా.. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే బాలయ్య, బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన సినిమాల మాదిరిగానే.. ఈ సినిమాను కూడా ఎన్నో అంచనాలతో తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్నమైన గెటప్స్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రీజర్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించాయి. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్‏గా రూపొందుతున్న ఈ సినిమాను మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.

తాజాగా అఖండ ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తయింది. దీంతో ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయినట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది. ఇక చివరి షెడ్యూల్‏లో హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. అలాగే బాలయ్య, బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న అఖండ మూవీ షూటింగ్ పూర్తికావడంతో ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టనున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా.. త్వరలోనే అఖండ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. దీంతో బాలయ్య అభిమానులు అఖండ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ప్రస్తుత పరిస్థితులతో చూసుకుంటే.. బాలయ్య సినిమా సంక్రాంతి బరిలో దిగనున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో జగపతి బా, శ్రీకాంత్, పూర్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ట్వీట్..

Also Read: Samantha: సామ్-చైతూ విడాకులపై స్పందించిన సమంత తండ్రి.. ఏమన్నారంటే..

Sonam Kapoor: సన్నజాజి సోనమ్ సొగసుకు ఫిదా అవ్వాల్సిందే.. బాలీవుడ్ బ్యూటీనా మజాకా..

Rashmi Gautam: రెడ్ డ్రెస్ లో రెడ్ హాట్ గా మెరిసిన ముద్ద మందారం.. అందాల రష్మీ లేటేస్ట్ ఫొటోస్..

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu