Balagam Movie: రూపాయి తీసుకోకుండా ఇల్లు ఇస్తే వేణు థ్యాంక్స్ చెప్పలేదు.. ‘బలగం’ ఇంటి యాజమాని కామెంట్స్..
బలగం సినిమాలోని మెయిన్ ఇల్లు అదే హీరో హౌస్.. మరింత ఫేమస్ అయ్యింది. ఆ ఇల్లు కోనరావుపేట మండలం.. కోలనూరు గ్రామంలో ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆ ఇంటి యజమాని రవీంద్రరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇప్పుడు ఎక్కడా చూసిన బలగం సినిమా మేనియా కనిపిస్తోంది. సిటీలోనే కాదు.. గ్రామాల్లోనూ ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోంది. ఇన్నాళ్లు కమెడియన్గా బుల్లితెరపై అలరించిన వేణు యెల్దండి.. తొలిసారి మెగా ఫోన్ పట్టి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎమోషనల్ చిత్రం ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తోంది. కుటుంబంలోని బంధాలు.. ఆప్యాయతలను తెలియజేస్తూ.. చావు చుట్టూ అల్లిన కథ ఇప్పుడు ప్రతి ఒక్కరిని మదని తాకుతుంది. బలగం సినిమాను పూర్తిగా తెలంగాణ గ్రామీణ నేపథ్యంలోనే తీసుకువచ్చారు. ఈ మూవీ షూటింగ్ అంతా కూడా సిరిసిల్ల పరిసర ప్రాంతాల్లోనే జరిగింది. ఇక ఇప్పుడు ఈ మూవీ భారీ విజయాన్ని అందుకోవడం… లొకేషన్స్ జరిగిన ప్రాంతాలు కూడా తెగ పాపులరయ్యాయి. ఇక ఈ సినిమాలోని మెయిన్ ఇల్లు అదే హీరో హౌస్.. మరింత ఫేమస్ అయ్యింది. ఆ ఇల్లు కోనరావుపేట మండలం.. కోలనూరు గ్రామంలో ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆ ఇంటి యజమాని రవీంద్రరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
“బలగం సినిమా దర్శకుడు వేణుది మా ఊరే. దిల్ రాజు గారు సినిమా ఛాన్స్ ఇచ్చారు. సాయం చేయమని అడిగితే నా ఇల్లు ఇచ్చాను. నెలన్నర రోజులు ఈ ఇంట్లో షూటింగ్ చేస్తే మేము వేరే ఇంట్లో ఉన్నాం. డబ్బులిస్తామని అన్నారు. కానీ నేనే వేణు దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఈ సినిమా ఊహించనంత పెద్ద హిట్టయింది. సినిమాలో మా ఇల్లు ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. సినిమా షూటింగ్ చాలా వారాలు జరిగింది. కానీ ఏనాడు దిల్ రాజు గారు ఇక్కడికి రాలేదు. ఆయన కూతురు, కొడుకు మాత్రమే వచ్చారు. సినిమా సక్సెస్ అయ్యాక వేణు కనీస థ్యాంక్స్ కూడా చెప్పలేదు. నా నెంబర్ ఆయన దగ్గర ఉంది. కానీ ఫోన్ కూడా చేయలేదు. మేము గుర్తు రాలేదు. అయినా ఆయన నుంచి ఇవేమి నేను ఆశించలేదు.. సినిమా కోసం ఇష్టపడి ఇల్లు ఇచ్చాను. దీని నుంచి ఎలాంటి పబ్లిసిటీ కోరుకోవడం లేదు” అని చెప్పుకొచ్చారు.




వేణు యెల్దండి తెరకెక్కించిన ఈ సినిమా మార్చి 3న విడుదలైన భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలు పోషించగా.. భీమ్స్ సిసిరిలియో సంగీతం అందించారు. చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపు 50 కోట్ల రాబట్టినట్లుగా తెలుస్తోంది.




