AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balagam: ‘సిగ్గుపడగానే సెలక్ట్ చేశారు.. సినిమా కోసం పది కేజీలు పెరిగాను’.. బలగం నటి సౌదామిని కామెంట్స్..

ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా నటించగా.. మిగతా నటీనటులు అడియన్స్ కు అంతగా తెలియనివారే. కానీ ఈ సినిమాతో ప్రేక్షకుల మనసులలో చెరగని స్థానం సంపాదించుకున్నారు. ఈ మూవీలో కనిపించింది తక్కువ సమయమే అయినా.. తన నటనతో నవ్వించింది. ఎక్కువగా డైలాగ్స్ లేకుండానే జనాలకు గుర్తుండిపోయింది. తనే సౌదామిని.

Balagam: 'సిగ్గుపడగానే సెలక్ట్ చేశారు.. సినిమా కోసం పది కేజీలు పెరిగాను'.. బలగం నటి సౌదామిని కామెంట్స్..
Balagam Actress Soudhamini
Rajitha Chanti
|

Updated on: Apr 24, 2023 | 9:30 PM

Share

ఇటీవల ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా థియేటర్లలో విడుదలై ప్రభంజనం సృష్టించిన సినిమా బలగం. కమెడియన్ వేణు దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఇది. కుటుంబంలోని అనుబంధాలు.. ఆప్యాయతలు.. పంతాలను వెండితెరపై ఆవిష్కరించింది ఈ సినిమా. ఈ చిత్రంలో నటించిన వారంతా ఫేమస్ నటీనటులు కాదు. కానీ తమ నటనతో ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించారు. బలగం మూవీలో నటించి ప్రతి ఆర్టిస్ట్ ఒక్కసారిగా క్రేజ్ వచ్చేసింది. ఈ చిత్రం ఓవైపు ఓటీటీలో విడుదలైనప్పటికీ గ్రామాల్లో ఇప్పటికీ ఈసినిమా స్క్రీన్స్ వేస్తున్నారు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా నటించగా.. మిగతా నటీనటులు అడియన్స్ కు అంతగా తెలియనివారే. కానీ ఈ సినిమాతో ప్రేక్షకుల మనసులలో చెరగని స్థానం సంపాదించుకున్నారు. ఈ మూవీలో కనిపించింది తక్కువ సమయమే అయినా.. తన నటనతో నవ్వించింది. ఎక్కువగా డైలాగ్స్ లేకుండానే జనాలకు గుర్తుండిపోయింది. తనే సౌదామిని.

బలగం సినిమాలో ప్రియదర్శి పెళ్లి చేసుకోబోయే అమ్మాయిగా కనిపించింది సౌదామిని. కొమురయ్య చనిపోయినప్పుడు కాబోయే భర్త ఇంటికి రావడం.. అక్కడ ప్రియదర్శి.. సౌదామిని మధ్య ఎలాంటి డైలాగ్స్ లేకుండానే.. కేవలం ఎక్స్‏ప్రెషన్స్‏తో సీన్స్ ప్రేక్షకులను నవ్వించాయి. ఇందులో ఒక్క డైలాగ్ లేకపోయినా.. తన ఎక్స్‏ప్రెషన్స్‏తోనే ఫేమస్ అయ్యింది. ఆర్టిస్ట్ కావాలనే కోరికతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సౌదామిని.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ సినిమా కోసం తాను ఏకంగా పది కేజీల బరువు పెరిగినట్లు చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

“సినిమా అడిషన్‏కు వెళ్లాక నన్ను సిగ్గు పడమన్నారు. సిగ్గు పడగానే సెలక్ట్ చేశారు. సౌదామిని పేరును వేణు సర్ సౌమ్య పిలిచారు. ఈ సినిమాలో ప్రియదర్శి చాలా సపోర్టింగ్ గా ఉంటారు. సినిమా కోసం పది కేజీలు పెరిగాను. కేకులు తినేసి బరువు పెరిగాను. ఫన్ జోనర్ సినిమాలంటే చాలా ఇష్టం. నా ఫస్ట్ సినిమా ఇదే. బీఎస్సీ ఫస్ట్ ఇయర్ లోనే చదువు ఆపేశా. చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్ అవ్వాలని కోరిక ఉండేది. ఎక్కడికి వెళ్లినా అన్నయ్యతో వెళ్తాను. చాలా మంది నువ్వు నీ మొహానికి హీరోయిన్ అవుతావా అనేవాల్లు. నేను స్థాయికి రావడం కారణం వేము సర్. బలగం సినిమా చూసి డైరెక్టర్ అనుదీప్ కాల్ చేశారు. మా సినిమాలో నీకు మంచి క్యారెక్టర్ ఇస్తామని చెప్పారు” అంటూ చెప్పుకొచ్చింది సౌదామిని.