RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమా పై ఆస్కార్ విన్నర్ షాకింగ్ కామెంట్స్.. గే లవ్ స్టోరీ అంటూ ట్వీట్..

నిన్న రాత్రి ఆర్ఆర్ఆర్ అనే 30 నిమిషాల చెత్త సినిమాను చూశాను అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. అతనికి ట్వీట్ కు బదులిస్తూ సౌండ్ డిజైనర్ రసూల్ పూకుట్టి ఆర్ఆర్ఆర్ గే లవ్ స్టోరీ అంటూ కామెంట్ చేశారు.

RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమా పై ఆస్కార్ విన్నర్ షాకింగ్ కామెంట్స్.. గే లవ్ స్టోరీ అంటూ ట్వీట్..
Rrr
Follow us

|

Updated on: Jul 05, 2022 | 8:51 AM

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే (RRR). పాన్ ఇండియా లెవల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్‏గా నిలవడమే కాకుండా భారీగా వసూళ్లు సాధించింది. ఇక్కడే కాకుండా విదేశాల్లో సత్తా చాటింది ఆర్ఆర్ఆర్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటించి ఈ సినిమాపై సినీ విశ్లేషకులు ప్రశంసలు కురిపించారు. చరణ్, తారక్ నటన.. రాజమౌళి దర్శకత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. అయితే ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ కొందరి నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది. తాజాగా మరోసారి ఓ నెటిజన్ చేసిన ట్వీట్‏కు రిప్లై ఇస్తూ ఆర్ఆర్ఆర్ ఏకంగా గే లవ్ స్టోరీ అనేశాడు ఆస్కార్ విన్నర్ రసూల్ పూకుట్టి. దీంతో అతనిపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.

నిన్న రాత్రి ఆర్ఆర్ఆర్ అనే 30 నిమిషాల చెత్త సినిమాను చూశాను అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. అతనికి ట్వీట్ కు బదులిస్తూ సౌండ్ డిజైనర్ రసూల్ పూకుట్టి ఆర్ఆర్ఆర్ గే లవ్ స్టోరీ అంటూ కామెంట్ చేశారు. దీంతో రసూల్ తీరుపై ఫైర్ అవుతున్నారు నెటిజన్స్. ఒక ఆస్కార్ విజేత నుంచి ఇలాంటి రియాక్షన్ మేము ఊహించలేదు అంటూ ఓ రెంజ్‏లో ఫైర్ అవుతున్నారు. రసూల్ పూకుట్టి ట్వీట్ పై బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ అసహనం వ్యక్తం చేశారు.

“మీరు చెప్పినట్లుగానే ఆర్ఆర్ఆర్ సినిమా గే లవ్ స్టోరీ అని నేను అనుకోను. అయితే అది గే లవ్ స్టోరీ అయితే తప్పేంటీ ? అది తప్పు విషయమా ? మీ మాటలను మీరు ఎలా సమర్ధించగలరు ? ఎన్నో విజయాలు అందుకున్న మీరు ఇలా తక్కువ స్థాయికి దిగజారి మాట్లాడటం మమ్మల్ని నిరాశకు గురిచేసింది ” అంటూ రిప్లై ఇచ్చారు. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా.. తారక్ కొమురం భీమ్ పాత్రలో నటించగా.. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, అజయ్ దేవగణ్, సముద్రగని, శ్రియా కీలకపాత్రలలో నటించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.