నేను ఏ విషయాన్నైనా సూటిగా చెప్తా.. నాగచైతన్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్

సినీ హీరో నాగచైతన్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను ఏ విషయాన్నైనా సూటిగా చెప్తానని, అందులో డబుల్‌ మీనింగ్‌ ఉండదని అన్నాడు. డబుల్‌ మీనింగ్‌ పదాలేంటో చెప్తే తెలుసుకుంటానని సలహా సైతం అడగడం గమనార్హం. నాగచైతన్య, రాశీఖన్నా జంటగా...

నేను ఏ విషయాన్నైనా సూటిగా చెప్తా.. నాగచైతన్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Naga Chaitanya
Follow us
Ganesh Mudavath

| Edited By: Ravi Kiran

Updated on: Jul 05, 2022 | 6:45 AM

సినీ హీరో నాగచైతన్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను ఏ విషయాన్నైనా సూటిగా చెప్తానని, అందులో డబుల్‌ మీనింగ్‌ ఉండదని అన్నాడు. డబుల్‌ మీనింగ్‌ పదాలేంటో చెప్తే తెలుసుకుంటానని సలహా సైతం అడగడం గమనార్హం. నాగచైతన్య, రాశీఖన్నా జంటగా నటించిన చిత్రం థ్యాంక్ యూల ఈ నెల 22న విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర బృందం చేపట్టిన ప్రచారంలో చైతూ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అంటూ కొన్ని ప్రశ్నలను యాంకర్ అడిగాడు. ఈ సందర్భంలోనే డబుల్ మీనింగ్ అంశం తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో నాగచైతన్య ఈ వ్యాఖ్యలు చేయడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. డైరెక్టర్ విక్రమ్‌ కె. కుమార్‌ తెరకెక్కించిన ఈ చిత్రంలో నాగచైతన్య మూడు విభిన్న లుక్స్‌లో కనిపించనున్నారు. రాశీఖన్నా, మాళవికా నాయర్‌, అవికా గోర్‌ నటించారు.

మనం సినిమా తర్వాత విక్రమ్‌- చైతన్య కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో ‘థ్యాంక్‌ యూ’పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్‌ పతాకం పై దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నాగ చైతన్య మూడు భిన్నమైన లుక్స్‌తో కనిపించనున్న ఈ చిత్రంలో రాశిఖన్నా, అవికాగోర్‌,మాళవిక నాయర్‌ కథానాయికలు. తమన్‌ స్వరాలు అందిస్తున్న ఈ సినిమాకు పీసీ శ్రీరామ్‌ ఛాయాగ్రహకుడుగా పనిచేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి