Sai Rajesh: గొప్ప మనసు చాటుకున్న ‘బేబీ’ డైరెక్టర్.. ఏడాది వయసున్న పిల్లాడి వైద్యం కోసం..
'బేబీ' సినిమాతో ఒక్కసారిగా క్రేజీ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయాడు సాయి రాజేష్. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య నటించిన ఈ ఫీల్ గుడ్ మూవీ యువతను బాగా ఆకట్టుకుంది. జులై 14న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. రిలీజై 3 వారాలు గడుస్తున్నా ఇప్పటికీ బేబీ థియేటర్లు హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో కళకళలాడుతున్నాయి. ఇప్పటివరకు సుమారు రూ.80 కోట్లకు పైగా వసూళ్లు

‘బేబీ’ సినిమాతో ఒక్కసారిగా క్రేజీ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయాడు సాయి రాజేష్. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య నటించిన ఈ ఫీల్ గుడ్ మూవీ యువతను బాగా ఆకట్టుకుంది. జులై 14న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. రిలీజై 3 వారాలు గడుస్తున్నా ఇప్పటికీ బేబీ థియేటర్లు హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో కళకళలాడుతున్నాయి. ఇప్పటివరకు సుమారు రూ.80 కోట్లకు పైగా వసూళ్లు బేబీ మూవీకి వచ్చాయని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. కాగా గతంలో కొబ్బరి మట్ట, హృదయ కాలేయం సినిమాలను డైరెక్ట్ చేశాడు సాయి రాజేష్. అలాగే జాతీయ పురస్కారం అందుకున్న కలర్ ఫొటో సినిమాకు రచయితగానే కాకుండా నిర్మాతగానూ వ్యవహరించాడు. ఇప్పుడు బేబీ సక్సెస్‌తో మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. సినిమాల సంగతి పక్కన పెడితే తాజాగా ఓ మంచి పని చేసి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు సాయి రాజేష్. ఏడాది వయసున్న ఓ బాలుడి వైద్యానికి తన వంతుగా రూ. 50వేల ఆర్థిక సాయం అందజేశారు.
వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ అంబేద్కర్ జిల్లా అంబాజీపేట మండలం గంగలకుర్రు గ్రామానికి చెందిన ఏడాది వయసున్న పిల్లాడు వేడి నూనెలో పడిపోయాడు. దీంతో ఆ బాలుడికి ఒళ్లంతా గాయాలయ్యాయి. పిల్లాడి వైద్యం కోసం దాతలు సాయం చేయాలని మహేశ్ బాబు ఫ్యాన్స్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో స్పందించిన బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ వెంటనే రూ.50వేల సాయం అందించారు. తద్వారా తన గొప్ప మనసును చాటుకున్నారు. సినీ అభిమానులు, నెటిజన్లు బేబీ డైరెక్టర్ మానవత్వాన్ని ప్రశంసిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.




మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.
