Avatar 2: అవతార్‌2 సినిమాకు పైరసీ బెడద.. మరికొన్ని గంటల్లో రిలీజ్.. వెబ్‌సైట్లలో ప్రత్యక్షమైన మూవీ..

నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న మూవీ పైరసీ ప్రింట్‌. వేలసంఖ్యలో డౌన్‌లోడ్‌ అవుతున్న పైరసీ ప్రింట్‌.. ఎక్కువసార్లు పైరసీకి గురైన సినిమాగా అవతార్‌1 రికార్డ్‌ క్రియేట్ చేయగా.. ఇప్పుడు అవతార్‌ 2

Avatar 2: అవతార్‌2 సినిమాకు పైరసీ బెడద.. మరికొన్ని గంటల్లో రిలీజ్.. వెబ్‌సైట్లలో ప్రత్యక్షమైన మూవీ..
Avatar 2
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 15, 2022 | 9:34 PM

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హాలీవుడ్ విజువల్ వండర్ అవతార్ 2. ఈ సినిమా డిసెంబర్ 16 అంటే రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఏకంగా 160 బాషల్లో విడుదల కానున్న సినిమా వారం ముందు నుంచే భారీ బుకింగ్స్ తో రికార్డ్స్ క్రియేట్ చేసిన అవతార్ కు అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. మరికొన్ని గంటల్లో విడుదలవ్వాల్సిన ఈ సినిమా పలు వెబ్ సైట్స్ లో ప్రత్యక్షమయ్యంది. ఆన్‌లైన్‌లో అవతార్ 2 పైరసీ ప్రింట్స్‌తో ఫ్రీ షోస్ నిర్వహిస్తున్నారు. థియేటర్లలో అవతార్ 2 రిలీజ్‌కు ముందే ఆన్‌లైన్‌లో లీక్‌ అయ్యింది. నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న మూవీ పైరసీ ప్రింట్‌. వేలసంఖ్యలో డౌన్‌లోడ్‌ అవుతున్న పైరసీ ప్రింట్‌.. ఎక్కువసార్లు పైరసీకి గురైన సినిమాగా అవతార్‌1 రికార్డ్‌ క్రియేట్ చేయగా.. ఇప్పుడు అవతార్‌ 2 కూడా పైరసీ బారిన పడటంతో వసూళ్లపై ఎఫెక్ట్‌ పడుతుంది.

ఈ సినిమా కోసం అభిమానులు 13 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 16న ఈ మూవీ ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళంలో విడుదల చేయనున్నారు. అయితే ఈ సినిమాను 3డీ, 4డీఎక్స్ 3డీ ఫార్మాట్ లలో విడుదల చేస్తుండడంతో ఆ స్క్రీన్స్ పై చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో అవతార్ 2 సినిమా లీక్ కావడంతో వసూళ్లపై భారీగా ఎఫెక్ట్ పడడం ఖాయం.

డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ అవతార్ 2 చిత్రాన్ని సాంకేతిక సాయంతో పండోరా అనే ప్రపంచాన్ని సృష్టించారు. అక్కడ నావీ అనే అటవీ తెగ జీవిస్తుంటింది. ప్రకృతే ప్రాణంగా జీవించే ఆ వింద ప్రాణులకు.. అభివృద్దే లక్ష్యంగా దూసుకెళ్లే మానవులకు మధ్య జరిగే పోరాటమే అవతార్ థీమ్. ఇందులో యాక్షన్ తోపాటు.. లవ్ స్టోరీ ఉంటుంది. అవతార్ మొదటి పార్ట్ రన్ టైం రెండు గంటల 42 నిమిషాలకు కాగా రెండో పార్ట్ రన్ టైమ్ మాత్రం మూడు గంటల పది నిమిషాలు ఉండబోతుందట. ఇండియాలో మొదటి రోజు 150 కోట్లు వస్తాయని అంచనా వేశాయి ట్రేడ్ వర్గాలు.. ఇప్పటికే 18 వేల కోట్లు బిజినెస్ అయ్యింది. భారీగా లాభాలు అర్జీంచవచ్చు అనుకుంటున్న సమయంలో ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్లతో గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది. అవతార్ 2 జస్ట్ హిట్ అనిపించుకోవాలంటే ప్రపంచంలో రెండో హైయెస్ట్ గ్రాసర్ కావాలి . ఫస్ట్ గ్రాసర్ 22 వేల కోట్లతో అవతార్ నెంబర్ వన్ గా నిలిచింది. ఇప్పుడు దాన్ని బ్రేక్ చేయాలి ఈ సినిమా సిద్ధమైంది. లెజెండరీ జేమ్స్ కామరూన్ 14 ఏళ్ళ తర్వాత తెరకెక్కించిన ఈ సీక్వెల్ ప్రపంచవ్యాప్తంగా 52,000 థియేటర్లలో విడుదల కానుంది. ఇండియాలో సాధారణంగా హాలీవుడ్ సినిమా రిలీజ్ అయితే కలెక్షన్లలో డిస్ట్రిబ్యూటర్లకు 30%.. నిర్మాతలకు 70% వాటా ఉంటుంది. కానీ అవతార్ 2 విషయంలో 50% కావాలని లోకల్ డిస్ట్రిబ్యూటర్లు గొడవ చేసినట్లుగా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆస్ట్రేలియాలో ఫ్లాప్‌షో.. కట్‌చేస్తే.. ఆ ముగ్గురు ఔట్?
ఆస్ట్రేలియాలో ఫ్లాప్‌షో.. కట్‌చేస్తే.. ఆ ముగ్గురు ఔట్?
సుప్రీంకోర్టులో సినీ నటుడు మోహన్ బాబుకు స్వల్ప ఊరట
సుప్రీంకోర్టులో సినీ నటుడు మోహన్ బాబుకు స్వల్ప ఊరట
ఏది నిజం..? గుండెపోటుకు సంబంధించి ఈ పుకార్లను అస్సలు నమ్మకండి..
ఏది నిజం..? గుండెపోటుకు సంబంధించి ఈ పుకార్లను అస్సలు నమ్మకండి..
బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న చాహల్, శ్రేయాస్ అయ్యర్
బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న చాహల్, శ్రేయాస్ అయ్యర్
పండుగ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం ఉంటుందా..?
పండుగ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం ఉంటుందా..?
దేశంలో 11కి చేరిన HMPV కేసులు.. జేబుకు చిల్లు పెడుతున్న టెస్టులు
దేశంలో 11కి చేరిన HMPV కేసులు.. జేబుకు చిల్లు పెడుతున్న టెస్టులు
ప్రాణాలు తీస్తోన్న చైనా మాంజా.. అందుకే ఈయన ఇలా
ప్రాణాలు తీస్తోన్న చైనా మాంజా.. అందుకే ఈయన ఇలా
పిల్లల ఫీజుల కోసం సచిన్ డబ్బు పంపాడు.. కానీ: కాంబ్లీ భార్య
పిల్లల ఫీజుల కోసం సచిన్ డబ్బు పంపాడు.. కానీ: కాంబ్లీ భార్య
గేమ్ ఛేంజర్ మేకింగ్ వీడియో అదిరిపోయింది.. హైలెట్ అదే..
గేమ్ ఛేంజర్ మేకింగ్ వీడియో అదిరిపోయింది.. హైలెట్ అదే..
ఖరీదైన పండు.. పోషకాలు మెండు.. డైలీ తిన్నారంటే కొలెస్ట్రాల్ ఖతమే..
ఖరీదైన పండు.. పోషకాలు మెండు.. డైలీ తిన్నారంటే కొలెస్ట్రాల్ ఖతమే..