Taapsee Pannu: ఆయన సినిమాలో కనిపిస్తే చాలనుకున్నా, ఇంతకు మించి ఇంకేం కావాలి.. తాప్సీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌.

ఝుమ్మంది నాథం సినిమాతో వెండి తెరకు పరిచయమైంది అందాల తార తాప్సీ. తెలుగులో పలు చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ ఇక్కడ ఆశించిన స్థాయిలో విజయాలను మాత్రం అందుకోలేదని చెప్పాలి. ఇక ఎప్పుడైతే బీటౌన్‌కి ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుంచి ఈ అమ్మడి ఫేట్ మారిపోయింది...

Taapsee Pannu: ఆయన సినిమాలో కనిపిస్తే చాలనుకున్నా, ఇంతకు మించి ఇంకేం కావాలి.. తాప్సీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌.
Tapsee Pannu
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 16, 2022 | 6:55 AM

ఝుమ్మంది నాథం సినిమాతో వెండి తెరకు పరిచయమైంది అందాల తార తాప్సీ. తెలుగులో పలు చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ ఇక్కడ ఆశించిన స్థాయిలో విజయాలను మాత్రం అందుకోలేదని చెప్పాలి. ఇక ఎప్పుడైతే బీటౌన్‌కి ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుంచి ఈ అమ్మడి ఫేట్ మారిపోయింది. వరుస విజయాలతో బాలీవుడ్‌లో మెరసిందీ చిన్నది. అనతికాలంలో అగ్ర హీరోల సరసన నటించే ఛాన్స్‌ కొట్టేసింది. ముఖ్యంగా హీరోయిన్‌ సెంట్రిక్‌ మూవీస్‌తో బీటౌన్‌ ప్రేక్షకులకు ఫిదా చేసింది. తాప్సీ నటించిన మెజారిటీ చిత్రాల్లో కేవలం కథ ప్రధాన అంశంగా తెరకెక్కినవే కావడం విశేషం. ఇలా వరుస విజయాలతో బీటౌన్‌లో దూసుకుపోతున్న ఈ బ్యూటీకి తాజాగా మరో ఊహించని అవకాశం దక్కిన విషయం తెలిసిందే.

షారుఖ్‌ఖాన్‌ హీరోగా తెరకెక్కిన ‘డంకీ’ చిత్రంలో ఈ అమ్మడు హీరోయిన్‌గా నటిస్తోంది. రాజ్‌కుమార్‌ హీరానీ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్‌మీదకు వెళ్లనుంది. షారుఖ్‌ లాంటి బడా హీరో సరసన హీరోయిన్‌గా నటించే అవకాశం దక్కడంతో ఈ అమ్మడు ప్రస్తుతం ఫుల్‌ ఖుషీలో ఉంది. తన కెరీర్‌లోనే ఇది అత్యుత్తమ అవకాశం తెగ మురిసిపోతోంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయమై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఈ విషయమై తాప్సీ మాట్లాడుతూ.. ‘షారుఖ్‌ఖాన్‌ చిత్రంలో అతిథి పాత్రలో నటించినా చాలనుకునేదాన్ని. అలాంటిది ఏకంగా హీరోయిన్‌గా నటించే అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉంది. రాజ్‌కుమార్‌ హీరానీ చిత్రాలు వినోదం, సందేశంతో ఉంటాయి. ఇండస్ట్రీలోని ఇద్దరు ఉత్తమ ప్రతిభావంతులతో కలిసి నటించడం ఆనందంగా ఉంది. ఓ నటికి ఇంతకుమించి ఏం కావాలి?’ అని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే డంకీ చిత్రం.. పంజాబ్‌ నుంచి కెనడాకు వెళ్లే అక్రమ వలసదారుల నేపథ్యంలో తెరకెక్కుతోన్నంది. 2023 డిసెంబర్‌లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్‌ ప్లాన్‌ చేస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..