AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhamaka Trailer: ‘ధమాకా’ ట్రైలర్ వచ్చేసింది.. మాస్ స్టైల్ యాక్షన్‏తో రవితేజ అదుర్స్..

ఇప్పటికే విడుదలైన టీజర్‌లో సినిమాలోని యాక్షన్‌ యాంగిల్ ఎక్కువగా చూపించారు. రవితేజ ద్విపాత్రాభినయం చేస్తూ డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ ఈరోజు లాంచ్ చేశారు.

Dhamaka Trailer: 'ధమాకా' ట్రైలర్ వచ్చేసింది.. మాస్ స్టైల్ యాక్షన్‏తో రవితేజ అదుర్స్..
Dhamaka Trailer
Rajitha Chanti
|

Updated on: Dec 15, 2022 | 8:01 PM

Share

మాస్ మహారాజా రవితేజ నటిస్తోన్న చిత్రం ధమాకా. ఈ చిత్రానికి ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌లను రూపొందించడంలో స్పెషలిస్ట్ అయిన త్రినాధ రావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో డబుల్ ఇంపాక్ట్ ఎంటర్ టైన్మెంట్ ని అందించడానికి సిద్ధంగా వున్నారు. అత్యున్నత ప్రమాణాలు, భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌లను రూపొందించడంలో పేరుపొందిన టిజి విశ్వ ప్రసాద్ ఈ కమర్షియల్ ఎంటర్ టైనర్ ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌లో సినిమాలోని యాక్షన్‌ యాంగిల్ ఎక్కువగా చూపించారు. రవితేజ ద్విపాత్రాభినయం చేస్తూ డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ ఈరోజు లాంచ్ చేశారు.

స్వామి (రవితేజ) నిరుద్యోగి. స్లమ్ లో నివసించే స్వామికి నెలకు కనీసం ఒక ఉద్యోగం సంపాదించడం చాలా కష్టంతో కూడుకున్న పని. మరోవైపు ఆనంద్ చక్రవర్తి (మరో రవితేజ) ఒక మల్టీ మిలియనీర్. అతను ఒక నెలలో 1000 మందికి ఉపాధిని ఇవ్వగలడు. మరోవైపు పావని (శ్రీలీల) వారిద్దరితో ప్రేమలో ఉంటుంది. స్వామి, ఆనంద్‌లు దారులు వేరు. కానీ విధి వారిని ఒక కామన్ శత్రువుతో పోరాడటానికి ఒకచోట చేరుస్తుంది. కథాంశం కమాండింగ్ గా వుంది. స్క్రీన్‌ప్లే రెసీ, ఎంటర్ టైనింగా వుంది. రవితేజ ఆనంద్‌గా క్లాస్‌గా కనిపించి స్వామిగా మాస్‌గా కనిపించారు. రెండు పాత్రలలోనూ ఒదిగిపోయినప్పటికీ మాస్ క్యారెక్టర్‌ మరింత ఆకర్షణీయంగా వుంది. శ్రీలీల తన ఛార్మ్ నెస్ తో ఆకట్టుకుంది. శ్రీలీలా, రవితేజ ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ అలరిస్తోంది. త్రినాథరావు నక్కిన ‘ధమాకా’ని పూర్తి ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. రవితేజ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించడం ఫ్యాన్స్ కు థ్రిల్ చేస్తోంది.

భీమ్స్ సిసిరోలియో యొక్క బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ముఖ్యంగా జింతాక్ బీట్స్ ఎక్స్ట్రా కిక్ ని ఇచ్చాయి. ఇప్పటికే ఈ సినిమా ఆడియో ఆల్బమ్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా విడుదలైన ట్రైలర్ అంతటా గ్రాండ్‌నెస్ ఉంది. త్రివిక్రమ్‌పై ఒక డైలాగ్ హిలేరియస్ గా వుంది. ఇది త్రివిక్రమ్ పై రచయితకు ఉన్న గౌరవాన్ని చూపుతుంది. మొత్తం మీద ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచింది. ఈ ట్రైలర్‌ తో భారీ అంచనాలు నెలకొల్పిన ‘ధమాకా’ డిసెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వినియోగదారులకు పెద్ద తలనొప్పిగా మారిన విండోస్‌ 11సమస్య.. ఏంటది?
వినియోగదారులకు పెద్ద తలనొప్పిగా మారిన విండోస్‌ 11సమస్య.. ఏంటది?
'ఇకపై పదో తరగతి ఇన్విజిలేటర్లు మొబైల్‌ ఫోన్లతో రావొద్దు'
'ఇకపై పదో తరగతి ఇన్విజిలేటర్లు మొబైల్‌ ఫోన్లతో రావొద్దు'
ఏపీ ప్రజలకు అలెర్ట్.. వాతావరణం అల్లకల్లోలం.. భారీ వర్షాలు..
ఏపీ ప్రజలకు అలెర్ట్.. వాతావరణం అల్లకల్లోలం.. భారీ వర్షాలు..
గ్లామర్ పాత్రలకు మాత్రమే సెట్ అవుతుంది.. ఆమెకు నటన రాదు..
గ్లామర్ పాత్రలకు మాత్రమే సెట్ అవుతుంది.. ఆమెకు నటన రాదు..
వేడివేడిగా ఉన్నాయని లొట్టలేస్తూ తింటున్నారా?.. ఇది చూస్తే
వేడివేడిగా ఉన్నాయని లొట్టలేస్తూ తింటున్నారా?.. ఇది చూస్తే
వాకింగ్ Vs రన్నింగ్.. బరువు తగ్గడానికి ఏది బెస్ట్..?
వాకింగ్ Vs రన్నింగ్.. బరువు తగ్గడానికి ఏది బెస్ట్..?
ధోనీ నుంచి రింకూ దాకా..పది జట్లలో పవర్‌ఫుల్ ఫినిషర్లు వీళ్లే
ధోనీ నుంచి రింకూ దాకా..పది జట్లలో పవర్‌ఫుల్ ఫినిషర్లు వీళ్లే
పాన్ కార్డులపై బిగ్ అప్డేట్.. కేంద్రం కీలక నిర్ణయం
పాన్ కార్డులపై బిగ్ అప్డేట్.. కేంద్రం కీలక నిర్ణయం
ఆ స్టార్ నటుడు చివరి రోజుల్లో తాగి డబ్బు కోసం ఇంటికొచ్చి ..
ఆ స్టార్ నటుడు చివరి రోజుల్లో తాగి డబ్బు కోసం ఇంటికొచ్చి ..
ఈ చిత్రంలో దాగిఉన్న పామును 5 సెకన్లలో కనిపెడితే మరే తోపు
ఈ చిత్రంలో దాగిఉన్న పామును 5 సెకన్లలో కనిపెడితే మరే తోపు