Rangabali: ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయిన నాగ శౌర్య నయా మూవీ.. రంగబలి స్ట్రీమింగ్ ఎప్పుడంటే
రీసెంట్‌గా రంగబలి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నాగ శౌర్య. పవన్ బాసంశెట్టి అనే నూతన దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర అంత ప్రభావం చూపలేకపోయింది. కానీ ఈ మూవీలో కమెడియన్ సత్య మాత్రం ప్రేక్షకులను తన కామెడీతో ఆకట్టుకున్నాడు. నాగ శౌర్య, సత్య మధ్య సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి.

యంగ్ హీరో నాగ శౌర్య సాలిడ్ హిట్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. అప్పుడెప్పుడో చలో సినిమా తర్వాత ఆ రేంజ్ లో హిట్ అందుకోలేకపోతున్నాడు. వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ అవి ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాయి. రీసెంట్‌గా రంగబలి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నాగ శౌర్య. పవన్ బాసంశెట్టి అనే నూతన దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర అంత ప్రభావం చూపలేకపోయింది. కానీ ఈ మూవీలో కమెడియన్ సత్య మాత్రం ప్రేక్షకులను తన కామెడీతో ఆకట్టుకున్నాడు. నాగ శౌర్య, సత్య మధ్య సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. అలాగే ఈ మూవీలో యుక్తి తరేజ నాగ శౌర్యకు జోడీగా నటించింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయ్యింది.
థియేటర్స్ లో అంత ఆకట్టుకోలేకపోయిన ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ రంగబలి సినిమా డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఆగస్టు 4 న రంగబలి సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
ఈ మూవీ ఊర్లో పెరిగే కుర్రాడి చుట్టూ నడుస్తుంది. ఈ సినిమాలో గోపరాజు రమణ, మురళి శర్మ కీలక పాత్రల్లో నటించారు. అలాగే దసరా సినిమాలో తన విలనిజంతో మెప్పించిన షైన్ టామ్ చాకో ఈ సినిమాలో కూడా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాడు. మరి రంగబలి మూవీ ఓటీటీలో ఎలా రాణిస్తుందో చూడాలి. ఇక ఇప్పుడు నాగ శౌర్య నందిని రెడ్డి దర్శకత్వంలో మూవీ చేయనున్నాడని టాక్ వినిపిస్తుంది. నాగ శౌర్య కోసం నందిని రెడ్డి ఓ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కథను సిద్ధం చేస్తుందని టాక్. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.
