AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వరుస ప్రమాదాలు, ఎన్నో చావులు.. ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలంటున్న వేణు స్వామి

వేణు స్వామి .. పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేని పేరు ఇది. సినిమా సెలబ్రెటీల జాతకాలు చెప్పడం, రాజకీయనాయకుల జాతకాలు చెప్పడంతో చాలా పాపులర్ అయ్యారు ఈయన. సెలబ్రెటీలు జాతకాలు చెప్పడంతో ఆయన సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అయ్యాడు. ఇకపై సెలబ్రిటీల జాతకాలను చెప్పనంటూ కొన్ని నెలల క్రితం సంచలన ప్రకటన చేశారు వేణు స్వామీ.

వరుస ప్రమాదాలు, ఎన్నో చావులు.. ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలంటున్న వేణు స్వామి
Venu Swamy
Rajeev Rayala
|

Updated on: Jun 18, 2025 | 11:45 AM

Share

ఎన్నో రకాల ప్రమాదాలు జరుగుతున్నాయి. వరదలు, భూకంపాలు, విమాన ప్రమాదాలు, ఊహించని రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల జూన్ 12న ఎయిర్ ఇండియా విమానం AI171 అహ్మదాబాద్‌లో ఇద్దరు అనుభవజ్ఞులైన పైలట్లు నడుపుతుండగా ప్రమాదానికి గురైంది. వాతావరణం కూడా పూర్తి అనుకూలంగా ఉంది. సరిగ్గా టేకాఫ్ అవుతున్నట్లు కనిపించిన విమానం కొంచెం ఎత్తుకు చేరుకున్న తర్వాత ఊహించని విధంగా ప్రమాదానికి గురయ్యింది. ఈ విమాన ప్రమాదం యావత్‌ దేశాన్ని.. కాదు కాదు మొత్తం ప్రపంచాన్ని బాధలో ముంచేసింది. ఈ ప్రమాదంలో 241 మంది విమానంలో ఉన్నవాళ్లు, అలాగే విమానం కూలిన ప్రాంతంలో ఉన్న మరికొంత మంది మరణించారు. ఈ వార్త తర్వాత చాలా మంది విమానం ఎక్కడానికి కూడా భయపడుతున్నారు..

ఇక భూమి మీద జరుగుతున్న వరుస ప్రమాదాల పై వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా సెలబ్రెటీల జాతకాలు చెప్పడం, రాజకీయనాయకుల జాతకాలు చెప్పడంతో చాలా పాపులర్ అయ్యారు ఈయన. సెలబ్రెటీలు జాతకాలు చెప్పడంతో ఆయన సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అయ్యాడు. ఇకపై సెలబ్రిటీల జాతకాలను చెప్పనంటూ కొన్ని నెలల క్రితం సంచలన ప్రకటన చేసిన వేణు స్వామీ.. మొన్నామధ్య నాగ చైతన్య- శోభిత ధూళిపాళ్ల వైవాహిక బంధంపై జోస్యం చెప్పారు. దీంతో అక్కినేని అభిమానులు గురూజీ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు జర్నలిస్టు సంఘాలు కూడా స్వామీజీ పై ఫైర్ అయ్యాయి. ఇప్పటికే ఎన్నో వివాదాల్లో చిక్కుకున్న వేణు స్వామి ఇప్పుడు మరోసారి సంచలన కామెంట్స్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఈ ఏడాదిలో జరుగుతున్న ప్రమాదాల గురించి వేణు స్వామి మాట్లాడుతూ.. కొన్ని రాశుల వారు  జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ” విమాన ప్రమాదాలు, సునామీ హెచ్చరికలు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు ఇవన్నీ వరుసగా జరుగుతున్నాయి. ఈ టైంలో సింహరాశిలో కుజుడు, కేతువు కలిసి ఉండడం వల్ల వివిధ రాశుల వారికి భారీగా నష్టాలు, సమస్యలు ఎదురవుతాయి. ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి. 2025 సెప్టెంబర్ 1 వరకు సమస్యలు వస్తాయి. ముఖ్యంగా సింహ, కన్యా, మకర, మీన వృషభ వారికి సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక సమస్యలు, తల్లికి అనారోగ్యం, ఉద్యోగం కోల్పోవడం, వ్యాపారంలో నష్టాలు వాహన ప్రమాదాలు, భార్యభర్త మధ్య గొడవలు వస్తాయి. ప్రకృతిపరంగా విమాన, అగ్ని, వాహన, ప్రయాణ ప్రమాదాలు, భూకంపాలు, సూనామీ, వంటివి జరుగుతాయి. ఎరుపు రంగుకు సంబంధించిన వాహనాలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి అన్నారు. అలాగే కేతువుకు సంబంధించిన జపాలు చేయండి. నవగ్రహాలకు పూజించండి, కుజుడు, కేతువులకు సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించుకోండి. ఇలా చేస్తే సమస్య నుంచి బయటపడతారు” అంటూ చెప్పుకొచ్చారు వేణు స్వామి.. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.