AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ashok Galla: మహేష్ మేనల్లుడి మరో సినిమా.. అశోక్ గల్లా సెకండ్ మూవీకోసం రంగంలోకి ప్రశాంత్ వర్మ

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, సూపర్ స్టార్ కృష్ణ మనవడు అశోక్ గల్లా ‘హీరో’ చిత్రంతో సినీ అరంగేట్రం చేశాడు. ఇక ఇప్పుడు రెండో సినిమాకు రెడీ అయ్యాడు.

Ashok Galla: మహేష్ మేనల్లుడి మరో సినిమా.. అశోక్ గల్లా సెకండ్ మూవీకోసం రంగంలోకి ప్రశాంత్ వర్మ
Ashok Galla
Rajeev Rayala
|

Updated on: Feb 05, 2023 | 5:20 PM

Share

టాలీవుడ్ లో కుర్ర హీరోలకు కొదవే లేదు.. ఇప్పటికే చాలా మంది యంగ్ హీరోలు తమదైన శైలిలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకుంటూ హిట్స్ అందుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అశోక్ గల్లా. సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, సూపర్ స్టార్ కృష్ణ మనవడు అశోక్ గల్లా ‘హీరో’ చిత్రంతో సినీ అరంగేట్రం చేశాడు. ఇక ఇప్పుడు రెండో సినిమాకు రెడీ అయ్యాడు. అ!, జాంబీ రెడ్డి వంటి బ్లాక్‌బస్టర్‌లను అందించి ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ హను-మాన్ కోసం పని చేస్తున్న క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి కథ అందించారు. గుణ 369 ఫేమ్ అర్జున్ జంధ్యాల ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. లలితాంబిక ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ నెం 1గా ఎన్నారై (ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్) సోమినేని బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

తన తొలి చిత్రం ‘హీరో’తో ఆకట్టుకున్న అశోక్ గల్లా తన తదుపరి స్క్రిప్ట్‌ని ఎంచుకోవడానికి కొంత సమయం తీసుకున్నారు. ఈ సినిమా కంప్లీట్ మేకోవర్ కాబోతున్నారు. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘గుణ 369’ దర్శకుడిగా అర్జున్ జంధ్యాల ప్రశంసలు అందుకున్నారు. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఐడియాలకు పేరుపొందిన ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి యూనిక్ స్టొరీని రాశారు. మరి ఈసారి ఎలాంటి కొత్త జానర్‌తో అలరించబోతున్నారో వేచి చూడాలి.

ఈరోజు( ఆదివారం) ఈ సినిమా గ్రాండ్ గా లాంచ్ అయింది. ముహూర్తం షాట్‌కు హీరో వెంకటేష్ క్లాప్‌ కొట్టగా, నమ్రత శిరోద్కర్ కెమెరా స్విచాన్ చేయగా, బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు. స్క్రిప్ట్‌ని మిర్యాల రవీందర్ రెడ్డి, సాహు గారపాటి, హరీష్ పెద్ది.. మేకర్స్, ప్రశాంత్ వర్మకు అందజేశారు. ఆది శేషగిరిరావు, బివిఎస్‌ రవి, గల్లా జయదేవ్‌ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

టాప్ టెక్నీషియన్స్ ఈ సినిమాకు పని చేస్తారు. ప్రముఖ రచయిత బుర్రా సాయిమాధవ్ డైలాగ్స్ అందిస్తున్నారు. ఇటీవల వచ్చిన ధమాకా చిత్రానికి బ్లాక్ బస్టర్ మ్యూజిక్ అందించిన పాపులర్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. మూవీ లాంచ్ ఈవెంట్ లో అశోక్ గల్లా మాట్లాడుతూ.. ప్రశాంత్ వర్మ షో రన్నర్ గా వుండటం నాకు, దర్శకుడు అర్జున్, మా టీం అందరికీ చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. సాయి మాధవ్ గారు ఈ సినిమాకి మాటలు రాయడం ఆనందంగా వుంది. నేను సాఫ్ట్ గా ఉంటానని అంటారు. ఈ సినిమాతో నన్ను అందరూ రఫ్ లుక్ లో కూడా యాక్సప్ట్ చేస్తారని నమ్ముతున్నాను. మీ అందరి కోసం ఒక మంచి సినిమా తెస్తాం. లాంచ్ ఈవెంట్ కి విచ్చేసి మాకు బెస్ట్ విశేష్ అందించిన వెంకటేష్ గారికి, బోయపాటి గారికి, నమ్రత అక్కకి, అందరికీ కృతజ్ఞతలు’’ తెలిపారు.

ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..