AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2 The Rule: హాస్పటల్‌లో అల్లు అర్జున్ .. పుష్ప 2 షూటింగ్‌కు బ్రేక్..!

ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ తన నటనతో ఆకట్టుకున్నాడు. ఊర మాస్ పాత్రలో బన్నీ ఇరగదీశాడు. అల్లు అర్జున్ నటనకు ఏకంగా నేషనల్ అవార్డు వచ్చింది. ఇక ఈ సినిమా కు మ్యూజిక్ మరో ప్రధాన ఆకర్షణ. ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమా తెరకెక్కుతోంది. అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న 'పుష్ప 2' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Pushpa 2 The Rule: హాస్పటల్‌లో అల్లు అర్జున్ .. పుష్ప 2 షూటింగ్‌కు బ్రేక్..!
Pushpa2
Rajeev Rayala
|

Updated on: Dec 02, 2023 | 3:12 PM

Share

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంచలన విజయం అందుకుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ తన నటనతో ఆకట్టుకున్నాడు. ఊర మాస్ పాత్రలో బన్నీ ఇరగదీశాడు. అల్లు అర్జున్ నటనకు ఏకంగా నేషనల్ అవార్డు వచ్చింది. ఇక ఈ సినిమా కు మ్యూజిక్ మరో ప్రధాన ఆకర్షణ. ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమా తెరకెక్కుతోంది. అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ‘పుష్ప 2’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ‘ పుష్ప ‘ చిత్రం సీక్వెల్‌ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే పుష్ప మూవీ షూటింగ్ కు బ్రేక్ పడిందని తెలుస్తోంది.

షూటింగ్‌లో అల్లు అర్జున్‌కి వెన్నునొప్పి రావడంతో పాటు అది ఎక్కువగా ఉండటంతో షూటింగ్ సగంలోనే ఆగిపోయిందని అంటున్నారు. అల్లు అర్జున్ ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అతడి నుంచి చిన్న  అప్‌డేట్‌ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

అల్లు అర్జున్ ‘పుష్ప 2’ పాట, ఫైట్ షూట్ కోసం రెడీ అయ్యాడు. ఈ సందర్భంగా ఆయనకు వెన్నునొప్పి వచ్చిందని తెలుస్తోంది. అందుకే సెట్ నుంచి నేరుగా ఆస్పత్రికి వెళ్లినట్లు సమాచారం. కంటిన్యూగా షూటింగ్ లో పాల్గొనడం వల్లే ఈ నొప్పి వచ్చి ఉంటుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అల్లు అర్జున్ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని అభిమానులు కోరుతున్నారు. దీని పై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

అల్లు అర్జున్ కి రెండు వారాల విరామం ఇవ్వాలని సుకుమార్ నిర్ణయించుకున్నాడు. అల్లు అర్జున్ వెన్నునొప్పి ఉన్నా షూటింగ్‌కి సిద్ధమయ్యాడని తెలుస్తోంది. అయితే,  ఈ నొప్పిని పట్టించుకోకుండా షూటింగ్ కొనసాగిస్తే, అది పెద్ద సమస్యలకు దారి తీస్తుంది. అలా జరగకూడదని సుకుమార్ ఈ నిర్ణయానికి వచ్చాడట. పుష్ప’ విడుదల తర్వాత ‘పుష్ప 2’ సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు చాలా సమయం పట్టింది. ఇప్పుడు ఈ సినిమా పనులను త్వరగా పూర్తి చేసేందుకు సుకుమార్ ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్టు 15న సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్ నటిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.