Salaar Movie : ప్రభాస్ సలార్ నుంచి రెండో ట్రైలర్ కూడా..! రిలీజ్ ఎప్పుడంటే
ప్రభాస్ మాస్ యాక్షన్ అవతార్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. కేజీఎఫ్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా తెరకెకెక్కుతోంది. ఈ సినిమా గురించి ప్రభాస్ తోపాటు ప్రేక్షకులు కూడా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 22 న సలార్ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇక నిన్న డిసెంబర్ 1న విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమా నుంచి ట్రైలర్ విడుదలైంది. ముందునుంచి అనుకున్నట్టే ఈ ట్రైలర్ సినిమా పై అంచనాలు భారీగా పెంచేసింది. ప్రభాస్ మాస్ యాక్షన్ అవతార్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. కేజీఎఫ్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా తెరకెకెక్కుతోంది. ఈ సినిమా గురించి ప్రభాస్ తోపాటు ప్రేక్షకులు కూడా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 22 న సలార్ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇక నిన్న డిసెంబర్ 1న విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. ఇప్పటికే ఈ ట్రైలర్ కు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. పాన్ ఇండియా మూవీగా విడుదలవుతున్న సలార్ సినిమా 5 భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
సలార్ సినిమా ప్రశాంత్ నీల్ గతంలో తెరకెక్కించిన ఉగ్రం సినిమా రీమేక్ అంటూ ఈ మధ్య వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. సలార్ కథ గురించి ఇటీవలే క్లారిటీ ఇచ్చాడు ప్రశాంత్ నీల్. సలార్ సినిమా లో ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ద శత్రువులుగా మారుతారు అని చెప్పాడు. దాంతో ఉగ్రం సినిమా కూడా ఇదే కథతో ఉండటంతో ఈ సినిమా ఉగ్రం కు రీమేక్ అంటూ వార్తలు పుట్టుకొచ్చాయి.
ఇదిలా ఉంటే సలార్ సినిమాను రెండు భాగాలూ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. మొదటి పార్ట్ లో ఇద్దరు మిత్రుల కథను చూపించనున్నారు. ఇక ఈ సినిమా ట్రైలర్ ఓ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే సలార్ మూవీ నుంచి రెండో ట్రైలర్ రిలీజ్ చేయనున్నారని టాక్ వినిపిస్తుంది. రిలీజ్ కు సరిగ్గా వారం రోజుల ముందు సలార్ నుంచి రెండో ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.
𝟏𝟎𝟎 𝐌𝐢𝐥𝐥𝐢𝐨𝐧 𝐕𝐢𝐞𝐰𝐬 𝐅𝐨𝐫 #SalaarTrailer 🔥💥https://t.co/QiP7mGuixL#Salaar #SalaarCeaseFire #SalaarCeaseFireOnDec22#Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @VKiragandur @hombalefilms @IamJagguBhai @sriyareddy @bhuvangowda84 @RaviBasrur… pic.twitter.com/9FJKYqgUj6
— Salaar (@SalaarTheSaga) December 2, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




