12 ఏళ్ల తర్వాత గురు వక్ర నివర్తి.. మూడు రాశులకి అదృష్టం, బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిపోతుంది!
బృహస్పతి ఇప్పుడు మిథునరాశిలో సంచరిస్తున్నాడు. మార్చి ప్రారంభంలో బృహస్పతి నేరుగా సంచారాన్ని ప్రారంభిస్తాడు. ఇది కొన్ని రాశులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశులవారు స్థానం, ప్రతిష్టను పొందవచ్చు. సంపదలోనూ భారీ పెరుగుదల ఉంటుంది. ఇప్పుడు ఆ అదృష్ట రాశుల గురించి తెలుసుకుందాం.

గ్రహాలు తరచూ వాటి రాశులను మార్చుకుంటాయి. దీంతో ఆయా రాశులపై ఆ ప్రభావం ఉంటుంది. ప్రస్తుతం బృహస్పతి తన గమనాన్ని మార్చుకుంటోంది. దీంతో కొన్ని రాశులపై నేరుగా ప్రభావం పడుతోంది. బృహస్పతి ఇప్పుడు మిథునరాశిలో సంచరిస్తున్నాడు. వేద పంచాంగం ప్రకారం.. గత సంవత్సరం నవంబర్ 11న కర్కాటకంలో సంచారం ప్రారంభించిన బృహస్పతి.. డిసెంబర్ 5 వరకు ఈ రాశిలో వక్ర స్థితిలో ప్రయాణించాడు. ఆ తర్వాత డిసెంబర్ 5న మధ్యాహ్నం 3.38 గంటలకు బృహస్పతి మిథునరాశిలోకి ప్రవేశించి మళ్లీ వక్రుడిగా మారాడు.
ఆ తర్వాత మార్చి 11, 2026న నివర్తికి చేరుకుంటాడు. మార్చి ప్రారంభంలో బృహస్పతి నేరుగా సంచారాన్ని ప్రారంభిస్తాడు. ఇది కొన్ని రాశులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశులవారు స్థానం, ప్రతిష్టను పొందవచ్చు. సంపదలోనూ భారీ పెరుగుదల ఉంటుంది. ఇప్పుడు ఆ అదృష్ట రాశుల గురించి తెలుసుకుందాం.
వృషభ రాశి
బృహస్పతి ప్రత్యక్ష సంచారం అంటే వక్ర నివర్తి వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలను తెస్తుంది. ఎందుకంటే బృహస్పతి మీ రాశి నుంచి రెండవ ఇంట్లో నేరుగా ప్రయాణించడం ప్రారంభిస్తాడు. దీంతో మీరు ఎప్పటికప్పుడు ఆర్థిక లాభాలను పొందుతారు. మీ ఆరోగ్యంగా కూడా మెరుగ్గా ఉంటుంది. ఈ సమయంలో ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి. ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం లభిస్తుంది. మీ మాటల ప్రభావం చాలా వరకు పెరుగుతుంది. ఇది ప్రజలను ఆకర్షిస్తుంది. మీకు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.
సింహరాశి
సింహరాశి వారికి బృహస్పతి వకర్ర నివర్తి ప్రయోజనకరంగా ఉంటుంది. బృహస్పతి మీ రాశి నుంచి 11వ ఇంట్లో సంచరిస్తున్నాడు. కాబట్టి, ఈ సమయంలో మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. పెట్టుబడులు పెడితే లాభాలను ఆర్జించవచ్చు. ఈ సమయంలో వ్యాపార ఒప్పందాలు మేలు చేస్తాయి. మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఆకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారవేత్తలు గొప్ప లాభాలను ఆర్జిస్తారు. మీకు స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. మీరు ఇన్వెస్ట్ చేస్తే స్టాక్ మార్కెట్లో కూడా లాభాలను ఆర్జిస్తారు.
మీనరాశి
బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. గురు నివర్తితో మీన రాశి వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. మీనరాశి నాల్గవ ఇంట్లో బృహస్పతి సంచారం జరుగుతుంది. దీంతో ఈ రాశివారు భౌతిక సుఖాలను పొందుతారు. మీరు విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వాహన యోగం ఉంది. కొత్త ఉద్యోగం లేదా వృత్తిని ప్రారంభించడానికి ఇది మంచి సమయం. ఈ సమయంలో పనిలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు లభిస్తాయి. మీ తల్లితో మీ సంబంధం బలపడుతుంది.
(Declaimer: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. TV9 తెలుగు దీనిని ధృవీకరించదు.)
