AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Money Horoscope: మార్చిలోగా వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి..! ఇందులో మీ రాశి ఉందా?

ఏ రాశుల వారి ద్వితీయ స్థానాధిపతి అంటే ధనాధిపతి బలంగా ఉంటే ఆ రాశుల వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ధనాధిపతి అనుకూలంగా ఉన్నవారికి సునాయాసంగా ఆదాయం పెరగడం జరుగుతుంది. ప్రస్తుత గోచారం ప్రకారం మేషం, వృషభం, కర్కాటకం, తుల, మకరం, మీన రాశులకు ధనాధిపతితో పాటు ధన కారకుడైన గురువు కూడా బాగా అనుకూలంగా ఉండడంతో వల్ల ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. మార్చి నుంచి జూన్ లోపు ఈ రాశుల వారికి ఆదాయం క్రమంగా పెరగడం, ఆదాయ మార్గాలు విస్తరించడం జరుగుతుంది. ఫలితంగా ఆర్థిక సమస్యలు దాదాపు పూర్తిగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 19, 2026 | 7:56 PM

Share
మేషం: ఈ రాశివారికి ధన స్థానాధిపతి అయిన శుక్రుడు జనవరి 13 నుంచి మార్చి 2 వరకు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ధన కారకుడైన గురువు క్రమంగా అనుకూలంగా మారుతుండడం వల్ల ఈ రాశివారు రెండు నెలల్లో ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్ల నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో ఈ రాశివారికి ఆదాయం బాగా పెరుగుతుంది. వీరికి షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర ఆర్థిక లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. రావలసిన సొమ్ము పూర్తిగా చేతికి అందుతుంది.

1 / 6
వృషభం: ఈ రాశికి ధనాధిపతి బుధుడు సుమారు మూడు నెలల పాటు భాగ్య, దశమ, లాభ స్థానాల్లో సంచారం చేస్తున్నందువల్ల ఎటువంటి ఆదాయ వృద్ది ప్రయత్నాలు చేపట్టినా నూరు శాతం ఫలితాలనిస్తాయి. ధన స్థానంలో గురువు ఉండడం వల్ల వీరికి ఒకటికి రెండుసార్లు ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలు రెండింతలు పెరిగే అవకాశం ఉంది. త్వరలో వీరికి ఆర్థిక సమస్యల నుంచి తప్పకుండా విముక్తి లభిస్తుంది.

2 / 6
కర్కాటకం: ఈ రాశివారికి ధనాధిపతి అయిన రవి మూడు నెలల పాటు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ రాశివారు ఆర్థిక సమస్యల నుంచి, ఆర్థిక అవసరాల నుంచి బయటపడడం జరుగుతుంది. ఆదాయం అనేక మార్గాల్లో వృద్ధి చెందుతుంది. ఆర్థికపరంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. రావలసిన డబ్బు చేతికి అందడంతో పాటు బాకీలు, బకాయిలు కూడా వసూలవుతాయి. షేర్ల వల్ల బాగా లాభాలు కలుగుతాయి.

3 / 6
తుల: ఈ రాశివారికి ధనాధిపతి అయిన శుక్రుడు నాలుగైదు నెలల పాటు అనుకూలంగా ఉండడం వల్ల వీరికి ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశం లేదు. ప్రతి ఆర్థిక సమస్యా తప్పకుండా పరిష్కారమవుతుంది. గురువు కూడా భాగ్య స్థానంలో ఉన్నందువల్ల ఆదాయం దినదినాభివృద్ది చెందుతుంది. వృత్తి, ఉద్యోగాల రీత్యానే కాక ప్రభుత్వం ద్వారా కూడా ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఒకటి రెండుసార్లు ధన యోగాలు కలుగుతాయి. ఆర్థికంగా ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు.

4 / 6
మకరం: ఈ రాశికి ధనాధిపతి శని తృతీయ స్థానంలో సంచారం చేయడంతో పాటు, గురువు షష్ట స్థానంలో ఉన్నందువల్ల ఈ రాశివారి ఆర్థిక, రుణ సమస్యలన్నీ ఏప్రిల్ లోపు క్రమంగా తొలగిపోతాయి.  ఆదాయ వృద్ధి ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. వివిధ మార్గాల్లో అపార ధన లాభం కలుగుతుంది. జీత భత్యాలు, లాభాలు, రాబడి పెరగడంతో పాటు షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల, ఆస్తిపాస్తుల వల్ల అంచనాలకు మించిన లాభాలు కలిగే అవకాశం ఉంది. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమవుతుంది.

5 / 6
మీనం: ఈ రాశికి ధన, భాగ్యాధిపతి అయిన కుజుడు మరో మూడు నెలల పాటు అనుకూల స్థానాల్లో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. ఆర్థికంగా ఏ ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించి ధన లాభం కలుగుతుంది. ఆస్తిపాస్తుల ద్వారా కూడా సంపద బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యల నుంచి త్వరలో తప్పకుండా విముక్తి లభిస్తుంది.

6 / 6
మార్చిలోగా ఆ రాశుల వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి..!

అతను నాకు గురువు.. ఎలా ప్రపోజ్ చేస్తా..!

బుడ్డోడికి ఏమైనా జరిగుంటే ఎవరిది బాధ్యత..?

రిపబ్లిక్ డే బ్రేక్ కావాలా?.. బడ్జెట్లో 5 బెస్ట్ ప్లేసెస్ ఇవే..

రోహిత్ లో కసి చచ్చిపోయిందా?..కివీస్ మాజీ స్టార్ షాకింగ్ కామెంట్స్

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పోస్టుల వివరాలు తప్పక తెలుసుకోండి

ఉపాధి హామీ కూలీలకు గుడ్‌న్యూస్‌.. ఫిర్యాదుల కోసం టోల్‌ ఫ్రీ నంబర్

'మీరు తోపులకు బాప్‌.. మీ సినిమాను ఎవడూ ఆపలేడు: టాలీవుడ్ నటుడు

మహిళా ఎస్సై చెంప చెళ్లుమనిపించిన మద్యం వ్యాపారి కూతురు

తక్కువ వడ్డీకి హోమ్‌లోన్‌.. సిబిల్‌ స్కోర్‌ ఎంత ఉండాలి?