AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirupati: పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు.. ఈ వీడియో చూస్తే నవ్వాపుకోలేరు

భోగి సంక్రాంతి ఆ తర్వాత రోజు కనుమ హుషారుగా జరుపుకునే యువత ఐరాల మండలం కలికిరి పల్లిలో అందరినీ ఆకట్టుకునేలా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. స్నేహితులు బంధువులకు కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు ఏర్పాటు చేయడంతో పాటు పెళ్లి కాని యువకులంతా తమకు వధువు కావాలంటూ ఫ్లెక్సీలో ఫోటోలు వేసి ఏర్పాటు చేశారు.

Tirupati: పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు.. ఈ వీడియో చూస్తే నవ్వాపుకోలేరు
Trending Updates
Raju M P R
| Edited By: |

Updated on: Jan 19, 2026 | 1:53 PM

Share

చిత్తూరు జిల్లాలోని ఒక గ్రామంలో పెళ్లి కాని యువకులు కొత్త ప్రయత్నం చేశారు. కలికిరిపల్లెలో వినూత్న బ్యానర్లను ఏర్పాటు చేసారు. పెళ్లికి యువతులు కావాలన్న సందేశంతో ఏకంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. పశువుల పండుగలో యువత క్రియేటివిటీ ని ప్రదర్శించడం హాట్ టాపిక్ అయింది. సంక్రాంతిని పెద్దల పండుగ జరుపుకునే చిత్తూరు జిల్లాలో పట్నం నుంచి పల్లెకు వచ్చిన యువకులు మూడు రోజులు పండుగ జరుపుకుంటారు. భోగి సంక్రాంతి ఆ తర్వాత రోజు కనుమ హుషారుగా జరుపుకునే యువత ఐరాల మండలం కలికిరి పల్లిలో అందరినీ ఆకట్టుకునేలా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. స్నేహితులు బంధువులకు కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు ఏర్పాటు చేయడంతో పాటు పెళ్లి కాని యువకులంతా తమకు వధువు కావాలంటూ ఫ్లెక్సీలో ఫోటోలు వేసి ఏర్పాటు చేశారు. గ్రామం నడిబొడ్డున ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలు సందర్శకులను ఆకట్టుకుంటుండగా అందరూ వింతగా చూస్తున్నారు. యువకుల స్పెషల్ బ్యానర్ల గ్రామంలో చర్చనీయాంశంగా మారిపోగా.. కలికిరిపల్లి పశువుల పండుగలో నవ్వులు పూయించింది. మ్యారేజ్ అడ్వర్టైజ్ బ్యానర్లను వినూత్న ఆలోచన చేసిన యువత పెళ్లి ప్రకటన పండుగలో సందర్శకుల దృష్టి ఆకర్షించింది. సాధారణంగా శుభాకాంక్షలు, సంప్రదాయ సందేశాలు, పశువుల పూజ ప్రాముఖ్యత వంటి విషయాలతో బ్యానర్లు ముస్తాబయ్యే ఉత్సవాల్లో ఈసారి మాత్రం యువకులు వినూత్న ఆలోచనతో ముందుకొచ్చారు.

ఇది చదవండి: ఆ డైరెక్టర్ ఇంటి గేటు దగ్గర ఛాన్స్‌లు కోసం నేను, చిరంజీవి వెయిట్ చేశాం.. ఓపెన్‌గా చెప్పిన టాలీవుడ్ హీరో

పండుగ వాతావరణాన్ని వినోదాత్మకంగా మార్చే ప్రయత్నంలో భాగంగా యువకులు తమ ఫోటోలను బ్యానర్లపై ముద్రించించి, వాటిపై స్టార్ గుర్తులు ఉంచుతూ పెళ్లికి యువతులు కావాలి అనే ప్రత్యేక సందేశాన్ని పొందుపరిచారు. ఈ అసాధారణమైన ఆలోచన పండుగకు వచ్చిన ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించగా బ్యానర్‌ను చూసిన గ్రామస్తులు, సందర్శకులు కడుపుబ్బా నవ్వుకున్నారు. ఈ క్రియేటివ్ ఆలోచనతో కొందరు యువకుల ప్రయత్నం సరదా వాతావరణాన్ని తీసుకొచ్చిందని గ్రామస్థులు అభిప్రాయపడ్డారుకలికిరిపల్లెలో హాట్ టాపిక్‌గా మారిన ఫ్లెక్సీ లు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి.

ఇది చదవండి: ఆరుగురు పతివ్రతలు చేశాక సినిమాలు ఆపేయడానికి కారణం ఇదే.. నిజాన్ని చెప్పిన సీరియల్ నటుడు

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ చూడండి

పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు..
పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు..
ఏపీలోని రైతులకు శుభవార్త.. ప్రభుత్వం మరో కొత్త పథకం
ఏపీలోని రైతులకు శుభవార్త.. ప్రభుత్వం మరో కొత్త పథకం
చావు దగ్గరపడుతుందని ముందే గ్రహించే జీవి ..శాస్త్రవేత్తలకే షాక్!
చావు దగ్గరపడుతుందని ముందే గ్రహించే జీవి ..శాస్త్రవేత్తలకే షాక్!
టీ20 ప్రపంచ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. రంగంలోకి మరో జట్టు?
టీ20 ప్రపంచ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. రంగంలోకి మరో జట్టు?
పదే పదే కడుపు నొప్పి వస్తున్నా లైట్ తీసుకుంటున్నారా.. ప్రమాదకరమే
పదే పదే కడుపు నొప్పి వస్తున్నా లైట్ తీసుకుంటున్నారా.. ప్రమాదకరమే
ఏడు జన్మలలో ఒకే వ్యక్తి భర్తగా ఉండగలరా..? ఎలా సాధ్యమో తెలుసుకోండి
ఏడు జన్మలలో ఒకే వ్యక్తి భర్తగా ఉండగలరా..? ఎలా సాధ్యమో తెలుసుకోండి
మందుబాబులకు పూనకాలే.. దేశంలోనే బెస్ట్ బార్ల లిస్ట్ వచ్చేసింది
మందుబాబులకు పూనకాలే.. దేశంలోనే బెస్ట్ బార్ల లిస్ట్ వచ్చేసింది
శుక్రుడి ఎఫెక్ట్ :అదృష్టం కలిసి వచ్చే రాశులివే.. మరి మీ రాశి ఉందా
శుక్రుడి ఎఫెక్ట్ :అదృష్టం కలిసి వచ్చే రాశులివే.. మరి మీ రాశి ఉందా
ఆధార్ కార్డు ఉన్నవారికి అదిరిపోయే న్యూస్..కేంద్రం నుంచి రూ.90వేలు
ఆధార్ కార్డు ఉన్నవారికి అదిరిపోయే న్యూస్..కేంద్రం నుంచి రూ.90వేలు
టీవీ9 నెట్‌వర్క్ ఆధ్వర్యంలో ఆటో 9 అవార్డులు..
టీవీ9 నెట్‌వర్క్ ఆధ్వర్యంలో ఆటో 9 అవార్డులు..