AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Game Changer: లోకల్ ఛానల్‏లో గేమ్ ఛేంజర్ సినిమా.. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు..

సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన సినిమాల్లో గేమ్ ఛేంజర్ ఒకటి. జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా అడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.

Game Changer: లోకల్ ఛానల్‏లో గేమ్ ఛేంజర్ సినిమా.. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు..
Game Changer
Rajitha Chanti
|

Updated on: Jan 17, 2025 | 11:47 AM

Share

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన సినిమా గేమ్ ఛేంజర్. పొలిటికల్ మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటించింది. అలాగే ఇందులో అంజలి, శ్రీకాంత్, ఎస్ జే సూర్య కీలకపాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా భారీ అంచనాల మధ్య జనవరి 10న ఈ సినిమా థియేటర్లలో విడుదలైన మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇందులో చరణ్ నటనపై ప్రశంసలు వచ్చాయి. కానీ సోషల్ మీడియాలో ఈ సినిమాపై ఎక్కువగా నెగిటివిటీని ప్రచారం చేస్తున్నారు. ఓవైపు గేమ్ ఛేంజర్ సినిమాకు థియేటర్లలో పాజిటివ్ రివ్యూస్ వస్తుండగా.. నెట్టింట మాత్రం కొందరు ఆగతాయిలు ట్రోల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మొదటి రోజే HD ప్రింట్ ను పైరసీ చేసి నెట్టింట రిలీజ్ చేశారు. ఆన్ లైన్ పైరసీ జరిగినా.. అటు సినిమాపై నెగిటివ్ ప్రచారం జరిగినప్పటికీ థియేటర్లలో మాత్రం విజయవంతంగా దూసుకుపోతుంది. అలాగే భారీగా వసూళ్లు రాబడుతుంది. మొదటి రోజే రూ.186 కోట్ల గ్రాస్ రాబట్టింది.

ఇదిలా ఉంటే.. గేమ్ ఛేంజర్ సినిమాను సంక్రాంతి పండక్కి లోకల్ టీవీల్లో రిలీజ్ చేశారు. దీంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలోని ఓ లోకల్ ఛానల్లో ఈ సినిమా పైరసీ కాపీని ప్రసారం చేయడం అంతటా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. దీనిపై చిత్రయూనిట్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న గాజువాక పోలీసులు దర్యాప్తు జరిపి తాజాగా ఆ ఛానల్ నిర్వాహకులను అరెస్ట్ చేశారు. ఈ కేసు విష‌యంలో మేనేజింగ్ డైరెక్టర్ హెచ్.వి.చలపతిరాజు అండ్ టీంతో పాటు గాజువాక పోలీస్ అండ్ క్రైమ్ క్లూస్ టీమ్‌.. అప్పలరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏపీ లోకల్ టీవీపై ఏపీ దాడులు నిర్వహించింది. గేమ్ ఛేంజర్ తెలుగు సినిమా పైరసీ చేస్తున్న వ్యక్తిని పోలీసులు అన్ని పరికరాలను స్వాధీనం చేసుకున్నారు మరియు ఎఫ్ఐఆర్ (22/2025) నమోదు చేసి అరెస్టు చేశారు.

గేమ్ ఛేంజర్ సినిమాను తమ ప్రాంతంలోని ఓ లోకల్ ఛానల్లో ప్రసారం చేస్తున్నారంటూ ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతేకాదు.. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ సైతం షేర్ చేశాడు. దీనిపై సినీ ప్రముఖులు, మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా వెనక కొన్ని వేలమంది శ్రమదాగి ఉంటుందని.. పైరసీ కాపీని ప్రదర్శించడం మంచి పద్దతి కాదని.. ఎంతో మంది నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇది చదవండి :  Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..

Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..

Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?

Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..