AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saif Ali Khan: గ్యారేజ్‌లో లగ్జరీ కార్లు.. ఆటోలోనే సైఫ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లిన కుమారుడు.. ఎందుకో తెలుసా?

గుర్తు తెలియని దుండగుడి దాడిలో సైఫ్ అలీఖాన్ తీవ్రంగా గాయపడడం సినిమా ఇండస్ట్రీలో ప్రకంపనలు రేపుతోంది. కత్తితో దాడి చేయడంతో సైఫ్ కు ఆరు చోట్లు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటనే అతనిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు సైఫ్.

Saif Ali Khan: గ్యారేజ్‌లో లగ్జరీ కార్లు.. ఆటోలోనే సైఫ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లిన కుమారుడు.. ఎందుకో తెలుసా?
Saif Ali Khan
Basha Shek
|

Updated on: Jan 17, 2025 | 9:57 AM

Share

సైఫ్ అలీఖాన్ స్టార్ హీరో. భారతీయ సినిమా ఇండస్ట్రీలో భారీ ఆస్తులు ఉన్న నటుల్లో అతను కూడా ఒకరు. వద్ద పలు లగ్జరీ కార్లు ఉన్నాయి. అయితే దుండగుడి దాడిలో తీవ్రంగా గాయపడి రక్తమోడుతోన్న సైఫ్ అలీఖాన్ ను ఆటోలోనే ఆస్పత్రికి తీసుకెళ్లాడు అతని కుమారుడు ఇబ్రహీం అలీఖాన్. గ్యారేజ్ లో లగ్జరీ కార్డు ఉన్నప్పటికీ ఇలా ఆటోలోనే సైఫ్ ఆస్పత్రికి తీసుకెళ్లడం చర్చనీయాంశమైంది. అయితే ఇందుకు కారణం కూడా ఉంది. తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో ఇంట్లో శబ్దాలు విని సైఫ్ లేచాడు. అక్కడ ఓ దుండగుడు పనివాళ్లతో గొడవ పడడం చూశాడు. వెంటనే అతనిని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ దుండగుడు కత్తితో సైఫ్‌పై దాడి చేశాడు. దీంతో నటుడి మెడ, వీపు సహా ఆరు చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. వెన్ను భాగంలో కత్తి మొన కూడా ఇరుక్కుంది. రక్తపు మడుగులో ఉన్న సైఫ్ ను చూసి అతని కుమారుడు ఇబ్రహీం చలించిపోయాడు. వెంటనే తండ్రిని ఆస్పత్రి నుంచి కారులో తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే,కార్లు ఏవీ సిద్ధంగా లేవు. డ్రైవర్లు కూడా అందుబాటులో లేరు. దీంతో ఇంటి బయటికి వెళ్లి ఆటో తీసుకొచ్చాడు. సైఫ్‌ను అందులోనే ఆసుపత్రికి తరలించారు. ఇదే సందర్భంలో కరీనా కపూర్ ఇంట్లో టెన్షన్‌తో నడుస్తున్న వీడియో వైరల్‌గా మారింది.

సైఫ్ అలీ ఖాన్ సద్గురు శరణ్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. అక్కడి నుంచి లీలావతి ఆసుపత్రి కేవలం 1.6 కి.మీ. దూరం ఉదయం 5 నిమిషాల్లో ఆసుపత్రికి చేరుకోవచ్చు. సరైన సమయానికి ఆటో రావడంతో సైఫ్ ను సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ నటునికి సర్జరీ జరిగింది. ప్రస్తుతం అతను క్రమంగా కోలుకుంటున్నాడు.

ఇవి కూడా చదవండి

దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు..

సైఫ్ ప్రస్తుతం లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. శస్త్రచికిత్స అనంతరం నటుడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు కేసును పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సైఫ్ అలీఖాన్‌పై దాడికి సంబంధించి నటి కరీనా కపూర్ వాంగ్మూలాన్ని కూడా త్వరలో నమోదు చేస్తారని భావిస్తున్నారు. నిందితుడికి సంబంధించి ఇంకేమైనా సమాచారం ఉందా? దీనికి కరీనా సమాధానమే ముఖ్యమని… పోలీసు వర్గాలు ఈ సమాచారం ఇచ్చాయి.

 దుండగుడి దాడి తర్వాత ఇంట్లో కరీనా కపూర్.. వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us