Tollywood: ఇంజినీరింగ్ చదివి సినిమా ఇండస్ట్రీలోకి.. టాలీవుడ్‌లో క్రేజీ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?
చాలామంది లాగే ఈ హీరో కూడా బీటెక్ చదివాడు. మెకానికల్ ఇంజినీరింగ్ లో డిగ్రీ పట్టా పుచ్చుకున్నాడు. కొన్ని రోజుల పాటు మల్టీ మీడియా యానిమేటర్ గా కూడా పనిచేశాడు. కానీ నటనపై ఆసక్తితో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి సక్సెస్ అయ్యాడు.

పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? అతను టాలీవుడ్ ప్రముఖ నటుడు. హీరోగా, విలన్ గా, కమెడియన్ గా, సహాయక నటుడిగా.. ఇలా ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోగలడు. అందుకే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇతనికి విలక్షణ నటుడిగా పేరుంది. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీసుల్లో నటిస్తూ బిజి బిజీగా ఉంటున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. ఇటీవల గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమాలోనూ ఓ కీలక పాత్రలో కనిపించాడు. అతను మరెవరో కాదు అందాల రాక్షసి సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన నవీన్ చంద్ర. అయితే ఇది అతని మొదటి సినిమా కాదు. అంతకంటే ముందే రెండు సినిమాల్లో నటించాడీ యాక్టర్. 2006లో సంభవామి యుగే యుగే అనే సినిమాలో నటించాడు నవీన్ చంద్ర. అందులో అంజి అనే పాత్రలో కనిపించాడు. ఆ మరుసటి ఏడాదే కల్యాణ్ం అనే మరో సినిమాలో చందు అనే రోల్ లో మెరిశాడు. కానీ ఈ రెండు సినిమాలు పెద్దగా ఆడలేదు. దీంతో నవీన్ చంద్ర కూడా క్లిక్ కాలేకపోయాడు.
వీటి తర్వాత సుమారు 5 ఏళ్ల గ్యాప్ తీసుకుని అందాల రాక్షసి సినిమాతో మన ముందుకు వచ్చాడు నవీన్ చంద్ర. ఇందులో సూర్య గా అతని అభినయం అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత నవీన్ కు తిరుగులేకుండా పోయింది. సోలో హీరోగా నటిస్తూనే స్టార్ హీరోల సినిమాల్లో ప్రధాన పాత్రలు పోసిస్తున్నాడు. వెబ్ సిరీసుల్లోనూ హిట్స్ కొడుతున్నాడు. దళం, త్రిపుర, లక్ష్మిదేవికి ఓ లెక్కుంది, మీలో ఎవరు కోటీశ్వరుడు, నేను లోకల్, జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్, దేవదాస్, అరవింద సమేత వీర రాఘవ, ఎవరు, మిస్ ఇండియా, అర్ధ శతాబ్ధం, గని, విరాట పర్వం, రంగ రంగ వైభవంగా, రిపీట్, వీరసింహా రెడ్డి, మట్కా ఇలా.. పలు పలు సినిమాల్లో నటించి మెప్పించాడు నవీన్ చంద్ర.
ఫ్యామిలీతో నవీన్ చంద్ర..
View this post on Instagram
ఇటీవల రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమాలోనూ ఓ కీలక పాత్రలో కనిపించాడు నవీన్. విలన్ ఎస్ జే సూర్య ప్రధాన అనుచరుడిగా నెగెటివ్ పాత్రలో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం నవీన్ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.
భార్య, పిల్లాడితో..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.







