Tollywood: ప్రేమకథలకు కేరాఫ్ అడ్రస్.. లేడీ గెటప్ వేసిన ఆ స్టార్ ఎవరో గుర్తుపట్టారా.. ?
టాలీవుడ్ ఇండస్ట్రీలో హ్యాట్రిక్ హిట్టుకొట్టిన హీరో. వరుస ప్రేమకథలతో వెండితెరపై అద్భుతమైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నాడు. అప్పట్లో తెలుగు సినీరంగంలో అత్యధిక ఫాలోయింగ్ సొంతం చేసుకున్న హీరో. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే పర్సనల్ విషయాలతో సతమతమై ప్రాణాలు వదిలాడు. ఎవరో తెలుసా.. ?

పైన ఫోటోలో లేడీ గెటప్ వేసుకున్న ఆ హీరోను గుర్తుపట్టారా.. ? తెలుగు సినీరంగంలో ఒకప్పుడు లవర్ బాయ్. ఎన్నో ప్రేమకథ చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వెండితెరపై తనదైన ముద్రవేశాడు. కానీ వ్యక్తిగత జీవితంలో ఎదురైన సమస్యలతో మానసిక సంఘర్షణకు గురయ్యాడు. వరుస సినిమాలు చేతిలో ఉండగానే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పటికీ అతడి పేరు చెబితే అడియన్స్ హృదయాలు బరువెక్కుతాయి. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. ? ఆ హీరో మరెవరో కాదు.. దివంగత స్టార్ ఉదయ్ కిరణ్. 2000లో చిత్రం సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే హిట్ అందుకున్నాడు.
ఆ తర్వాత తేజ దర్శకత్వం వహించిన నువ్వు నేను సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇప్పటికీ ఈ సినిమా పాటలు వినిపిస్తూనే ఉంటాయి. ఆ తర్వాత వెంటనే మనసంతా నువ్వ మూవీతో మరో హిట్ అందుకున్నాడు. అప్పట్లో వరుసగా హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న ఏకైక హీరోగా నిలిచాడు. అలాగే అప్పట్లో అమ్మాయిల ఫేవరేట్ హీరో. ఎక్కువగా గర్ల్స్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ సొంతం చేసుకుంటూ బిజీగా ఉన్న సమయంలోనే పర్సనల్ విషయాలు ఉదయ్ కెరీర్ పై ప్రభావం చూపించాయి.
దీంతో సినిమాల ఎంపికలో తడబడ్డాడు. ఆ తర్వాత వరుసగా డిజాస్టర్స్ వచ్చాయి. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఉదయ్.. 2014 జనవరి 6న తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయ్ అకాల మరణం అభిమానులు, స్టార్ నటీనటులు జీర్ణించుకోలేకపోయారు. ఇదంతా పక్కన పెడితే పైన కనిపిస్తున్న ఫోటో.. ఉదయ్ కిరణ్ ఏ సినిమాలోనిదో తెలుసా.. ఆ మూవీ ఇప్పటికీ రిలీజ్ కాలేదు. ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన చిత్రం జోడి నెం.1. డైరెక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వెన్య, శ్రీజ, కౌశల్, సుమీత్, గౌతమ్ రాజు ప్రధాన పాత్రలు పోషించారు. వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించిన ఈ మూవీ కొన్ని అనివార్య కారణాల వల్ల రిలీజ్ కాలేదు.

Uday Kiran Pic
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..



