AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: సినిమాలు వదిలేసి ఆర్మీలోకి.. ఆపై కార్గిల్ యుద్ధంలో సైనికుడిగా.. ఆ హీరో ఎవరంటే..

సినీరంగంలో ఒకప్పుడు స్టార్ హీరో. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. హీరోగానే కాకుండా వయసుకు తగినట్లుగా వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. కానీ కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే సినిమాలు వదిలేసి కార్గిల్ యుద్ధంలో చేరి సేవలు అందించాడు. భారత సైన్యంలో చేరి రియల్ హీరో అనిపించుకున్నాడు.

Tollywood: సినిమాలు వదిలేసి ఆర్మీలోకి.. ఆపై కార్గిల్ యుద్ధంలో సైనికుడిగా.. ఆ హీరో ఎవరంటే..
Actor
Rajitha Chanti
|

Updated on: Jan 17, 2025 | 8:28 AM

Share

భారతీయ సినీపరిశ్రమలో వైవిధ్యమైన పాత్రలు, విభిన్నమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తనదైన నటనతో అడియన్స్ హృదయాల్లో చోటు సంపాదించుకున్న ఆ నటుడు ఏకంగా మూడు సార్లు నేషనల్ అవార్డ్ గెలుచుకున్నారు. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో సినీప్రియులను అలరించాడు. కానీ వరుస సినిమాలతో కెరీర్ మంచి పీక్స్ లో ఉన్నప్పుడే కార్గిల్ యుద్ధ సమయంలో సైన్యంలో చేరి సరిహద్దుల్లో విశేషమైన సేవలు అందించాడు. ఈ ఆసక్తికరమైన విషయాన్ని సదరు నటుడు స్వయంగా వెల్లడించాడు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు సైన్యంలో చేరాలనే తపన ఆయన మాటల్లోనే కనిపించింది. ఇన్నాళ్లు వెండితెరపై నటుడిగా అలరించిన ఆయన కార్గిల్ యుద్ధ సమయంలో సైన్యంలో చేరి సేవలు అందించాడనే విషయం తెలిసి జనాలు షాకవుతున్నారు. ఇంతకీ ఆ నటుడు ఎవరో తెలుసా.. ? అతడే బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్. తాజాగా అమితాబ్ బచ్చన్ నిర్వహిస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి షోలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని బయటపెట్టాడు.

నానా పటేకర్ హిందీ చిత్రపరిశ్రమలో ఎన్నో చిత్రాల్లో నటించి నటుడిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. నానా పటేకర్ మిలటరీ జీవితానికి కొత్త కాదు. 1990లో తొలినాళ్లలో ప్రహార్ సినిమా చేస్తున్న సమయంలో ఆయన మూడేళ్లు మరాఠ లైట్ ఇన్ఫాంట్రీతో కలిసి ట్రైనింగ్ తీసుకున్నాడు. 1999లో కార్గిల్ యుద్ధంలో పాల్గొనాలనుకున్నాడు. వెంటనే ఆర్మీలోని సీనియర్ అధికారులను కలిసి ఫ్రంట్ లైన్ కు వెళ్లాలనే కోరికను తెలిపాడు. అందుకు రక్షణ మంత్రి అనుమతి ఉండాలని తెలియడంతో అప్పటి రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ కు ఫోన్ చేసి తాను మరాఠా లైట్ ఇన్ఫాంట్రీలో శిక్షణ తీసుకున్న విషయాన్ని చెప్పాడు. దీంతో వెంటనే అతడికి అనుమతి ఇచ్చారు. 1999 ఆగస్టులో నానా పటేకర్ ఏకంగా రెండు వారాలపాటు సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి గడిపాడు.అక్కడ సైనికులకు సాయం చేయడం.. గాయపడిన వారి కోసం బేస్ హాస్పిటల్లో పనిచేయడం లాంటి పనులు చేశాడు. అక్కడి పరిస్థితులు ఎంతో కఠినంగా ఉండేవని.. శ్రీనగర్ కు వెళ్లేప్పుడు తాను 76 కిలోల బరువు ఉండగా.. తిరిగి వచ్చేసరికి 56 కిలోలు ఉన్నట్లు తెలిపాడు.

Nana Patekar

Nana Patekar

కార్గిల్ యుద్ధం ముగిసిన తర్వాత నానా పటేకర్ మళ్లీ తన సినీ ప్రయాణాన్ని కొనసాగించాడు. గతేడాది వన్వాస్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చాడు. అంతేకాదు.. అంతకుముందు విభిన్నమైన సినిమాల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అటు కార్గిల్ యుద్ధంలో సైనికుడిగా దేశం కోసం సేవ చేశాడు. ఈ విషయం తెలిసి నానా పటేకర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు జనాలు.

ఇది చదవండి :  Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..

Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..

Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?

Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..

ఫిఫా విజేతకు రూ. 451 కోట్ల జాక్‌పాట్.. భారీగా పెరిగిన ప్రైజ్ మనీ
ఫిఫా విజేతకు రూ. 451 కోట్ల జాక్‌పాట్.. భారీగా పెరిగిన ప్రైజ్ మనీ
భారత్‌కు పొంచి ఉన్న ముప్పు.. సరిహద్దుల్లో డ్రాగన్ పన్నాగాన్ని..
భారత్‌కు పొంచి ఉన్న ముప్పు.. సరిహద్దుల్లో డ్రాగన్ పన్నాగాన్ని..
దరిద్రం తీరిపోయే సమయం వచ్చేసింది.. వీరికి మహాలక్ష్మి యోగం
దరిద్రం తీరిపోయే సమయం వచ్చేసింది.. వీరికి మహాలక్ష్మి యోగం
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
15 ఏళ్లుగా వెండితెరకు దూరం.. కానీ దేశంలోనే అత్యంత ధనిక హీరోయిన్!
15 ఏళ్లుగా వెండితెరకు దూరం.. కానీ దేశంలోనే అత్యంత ధనిక హీరోయిన్!
దేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్స్‌ ఇవే..మార్కెట్లో ఫుల్‌ డిమాండ్
దేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్స్‌ ఇవే..మార్కెట్లో ఫుల్‌ డిమాండ్
ప్రేమించి పెళ్లాడి.. 9 నెలలకే భార్యను హతమార్చిన భర్త!
ప్రేమించి పెళ్లాడి.. 9 నెలలకే భార్యను హతమార్చిన భర్త!
మేకప్‌కి నో చెప్తున్నా భారీ ఆఫర్లు..! స్టార్ నటి సీక్రెట్ ఏంటి?
మేకప్‌కి నో చెప్తున్నా భారీ ఆఫర్లు..! స్టార్ నటి సీక్రెట్ ఏంటి?
అప్పటి కల్లా ఫైళ్లన్నీ ఆన్‌లైన్ కావాలి.. కలెక్టర్లకు చంద్రబాబు..
అప్పటి కల్లా ఫైళ్లన్నీ ఆన్‌లైన్ కావాలి.. కలెక్టర్లకు చంద్రబాబు..
ఒక దశాబ్దపు ప్రస్థానం! ఆ సూపర్‌‌హిట్ సినిమాకు పదేళ్లు
ఒక దశాబ్దపు ప్రస్థానం! ఆ సూపర్‌‌హిట్ సినిమాకు పదేళ్లు