AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saif Ali Khan: సైఫ్‌పై హత్యాయత్నం.. రంగంలోకి ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్.. ఇంతకీ ఎవరీయన?

బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడి సినిమా ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపింది. ఎంతో కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రాంతంలో నటుడిపై ఇలా దాడి జరగడం అందరినీ షాక్ కు గురి చేస్తోంది. దుండగుడి దాడిలో సైఫ్ తీవ్రంగా గాయపడ్డాడు.

Saif Ali Khan: సైఫ్‌పై హత్యాయత్నం.. రంగంలోకి ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్.. ఇంతకీ ఎవరీయన?
Saif Ali Khan Stabbed Case
Basha Shek
|

Updated on: Jan 17, 2025 | 7:00 AM

Share

దుండగుడి దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాలీవుడ్ ప్రముఖ నటుడు ప్రస్తుతం లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆరు చోట్ల తీవ్రమైన గాయాలు కావడంతో అతనికి శస్త్రచికిత్స జరిగింది. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాగా దర్యాప్తులో భాగంగా ప్రముఖ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ సైఫ్ అలీఖాన్ ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. భద్రత కట్టుదిట్టంగా ఉన్నప్పటికీ దాడి ఎలా జరిగిందనే విషయంపై ఆరా తీశారు. దయానాయక్ సైఫ్ ఇంటిని పరిశీలిస్తోన్న ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో మరోసారి ఈ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ పేరు ట్రెండింగ్ లోకి వచ్చింది. ముంబయి అండర్‌వరల్డ్‌ను గడగడలాడించిన ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా దయా నాయక్‌కు మంచి గుర్తింపు ఉంది. అండర్‌ వరల్డ్‌ నెట్‌వర్క్‌కు పనిచేస్తున్న దాదాపు 80 మందిని దయా నాయక్ ఎన్‌కౌంటర్‌ చేసినట్లు సమాచారం.

కర్ణాటకలోని ఉడిపి దయా నాయక్ స్వస్థలం. 1979లో ఆయన ఫ్యామిలీ ముంబయికి వచ్చి స్థిర పడింది. అంధేరిలోని కాలేజ్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. ఆ తర్వాత 1995లో పోలీస్‌ పరీక్షల్లో విజయం సాధించారు. మొదటిసారి ముంబయిలోని జుహు పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా విధుల్లో చేరారు. దయా నాయక్‌ ఉద్యోగంలో చేరేసరికి అండర్‌వరల్డ్‌ పేరుతో ముంబయిలో హత్యలు, డ్రగ్స్‌, హవాలా సహా ఎన్నో నేరాలు ఎక్కువగా ఉండేవి. అప్పుడే రంగంలోకి దిగిన దయానాయక్ చోటా రాజన్‌ గ్యాంగ్‌లోని ఇద్దరిని కాల్చి చంపాడు. దీంతో ఈ పోలీసాఫీసర్ పేరు మార్మోగిపోయింది. డిపార్ట్‌మెంట్‌లోనూ దయానాయక్ పేరు ఓ రేంజ్‌లో వినిపించింది. అండర్‌ వరల్డ్‌ నెట్‌వర్క్‌కు పనిచేస్తున్న దాదాపు 80 మందిని దయా నాయక్ ఎన్‌కౌంటర్‌ చేసినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా మంచి పేరు సంపాదించిన దయానాయక్ పై అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీబీ ఆయన్ను విచారించి అరెస్ట్‌ కూడా చేసింది. అయితే 2012లో మళ్లీ అదనపు కమిషనర్‌గా  తిరిగి విధుల్లో చేరారు. నాయక్‌ జీవిత కథ స్ఫూర్తితో హిందీ, తెలుగు భాషల్లో పలు సినిమాలు కూడా తెరకెక్కాయి. అలాంటి దయానాయక్ ఇప్పుడు సైఫ్ కేసును దర్యాప్తు చేయడానికి రంగంలోకి దిగడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సైఫ్ అలీఖాన్ ఇంటివద్ద దయానాయక్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.