Vijay Sethupathi: అరవింద్ స్వామిని బయటకు పంపించండి.. విజయ్ సేతుపతి కామెంట్స్.. హీరో రియాక్షన్ ఇదే..
సౌత్ ఇండస్ట్రీలో అగ్ర నటులలో విజయ్ సేతుపతి ఒకరు. సింప్లిసిటికీ బ్రాండ్ అంబాసిడర్. సహజమైన నటనతో తమిళం, తెలుగు భాషలలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారడు. వైవిధ్యమైన పాత్రలు, విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ హీరోగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు.

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతికి సినీరంగంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. వైవిధ్యమైన పాత్రలలో తనదైన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తెలుగులో ఉప్పెన చిత్రంలో రాయనం పాత్రతో సినీప్రియుల హృదయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. తెలుగు, తమిళంలో వరుస సినిమాలతో అలరిస్తున్న విజయ్.. గతేడాది బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. షారుఖ్ ఖాన్, అట్లీ కాంబోలో వచ్చిన జవాన్ చిత్రంలో విలన్ పాత్రలో అదరగొట్టేశాడు. ఈ మూవీతో అటు నార్త్ అడియన్స్ కు దగ్గరయ్యాడు. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. సీనియర్ హీరో అరవింద్ స్వామి గురించి చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. బాలీవుడ్ కు చెందిన ఓ తాజాగా పాన్ ఇండియా యాక్టర్స్ రౌండ్ టేబుల్ అంటూ ఓ కార్యక్రమం నిర్వహించింది. దీనికి టాలీవుడ్, బాలీవుడ్ స్టార్స్ హాజరయ్యారు. కోలీవుడ్ నుంచి విజయ్ సేతుపతి, ప్రకాష్ రాజ్, అరవింద్ స్వామి ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
అలాగే టాలీవుడ్ నుంచి సిద్ధూ జొన్నలగడ్డ, మలయాళం నుంచి ఉన్ని ముకుందన్ హాజరయ్యారు. అలాగే హిందీ నుంచి విజయ్ వర్మ హాజరయ్యారు. ఇదిలా ఉంటే.. తాజాగా కోలీవుడ్ స్టార్స్ పాల్గొన్న ఇంటర్వ్యూలో విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి చేసిన పని చూసి నవ్వుకుంటున్నారు నెటిజన్స్.. మీరు ఎప్పుడైనా ఆడిషన్ ఇవ్వడానికి భయపడ్డారా.. ? మీకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉందా అంటూ యాంకర్ విజయ్ సేతుపతిని అడిగారు. ఇందుకు విజయ్ మాట్లాడుతూ.. ” నాకు తక్కువ అనే ఫీలింగ్ ఉండదు. కానీ కొంతమంది యాక్టర్స్ ను చూసినప్పుడు ముఖ్యంగా అరవింద్ స్వామి, ప్రకాష్ రాజ్ ఇద్దరి యాక్టింగ్ నాకు చాలా ఇష్టం. వాళ్లను చూసేటప్పుడు నాకు ఒక భయం వస్తుంది. ఇలా నేను చేయగలనా.. వాళ్లు ఎంత బాగా యాక్ట్ చేస్తున్నారు అనుకుంటాను” అంటూ విజయ్ సేతుపతి చెబుతుండగా.. అరవింద్ స్వామి ప్రకాష్ వైపు చూసి నవ్వుకుంటాడు.
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
అప్పుడే ప్రకాష్ రాజ్ సైతం అరవింద్ స్వామి వైపు చూస్తూ నవ్వుతుంటాడు. ఇది గమనించిన విజయ్ సేతుపతి వెంటనే.. సార్ ఆపుతారా మీరు.. ముందు ఈయన్ని బయటకు పంపేయండి. ఇంటర్వ్యూను స్పాయిల్ చేస్తున్నారు అంటూ సరదాగా నవ్వుతూ అన్నాడు. దీంతో అక్కడున్న వారంతా తెగ నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. నిజానికి విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి మంచి స్నేహితులు అని చాలామందికి తెలియదు.
Aravind swami 😂😂 pic.twitter.com/KnJx6Gfpxs
— Ethuku (@ethuku_007) January 15, 2025
ఇది చదవండి : Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..



