AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Online Ticketing: పెద్ద సినిమాలు ఇక్కడ… బడా ప్రొడ్యూసర్ల కష్టాలు తీర్చే ‘పెద్దన్న’ ఎక్కడ?

ప్రమోషన్లు సరే... కలెక్షన్ల మాటేంటి? పైకి గంభీరంగా కనిపిస్తున్నారు గాని...పెద్ద సినిమా నిర్మాతల గుండెల్లో ఈ గుబులు మామూలుగా లేదు.

AP Online Ticketing: పెద్ద సినిమాలు ఇక్కడ... బడా ప్రొడ్యూసర్ల కష్టాలు తీర్చే 'పెద్దన్న' ఎక్కడ?
Online Movies Ticket
Janardhan Veluru
| Edited By: Ravi Kiran|

Updated on: Nov 30, 2021 | 6:02 PM

Share

Big Budget Movies” ప్రమోషన్లు సరే… కలెక్షన్ల మాటేంటి? పైకి గంభీరంగా కనిపిస్తున్నారు గాని…పెద్ద సినిమా నిర్మాతల గుండెల్లో ఈ గుబులు మామూలుగా లేదు. రోజుకు నాలుగాటలు మాత్రమే.. అంతకు మించి షోలు వేస్తే తోలు తీసుడే అని డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చిన ఏపీ సర్కారుతో పెద్ద చిక్కొచ్చి పడింది నిర్మాతలకు. డిసెంబర్ నెల మొదలైపోతోంది. అఖండతో మొదలుపెడితే నెక్స్ట్ సమ్మర్ దాకా వారానికో పెద్ద సినిమా చొప్పున రిలీజ్ కోసం క్యూలో నిలబడ్డాయి.

పెద్ద హీరోల సినిమాలకు అభిమానులే ఆక్సిజన్! వాళ్లతో వచ్చే ఓపెనింగ్స్ మాత్రమే సినిమాను నిలబెట్టేది. కానీ… మొదటి మూడురోజుల్లో పడే బెనిఫిట్ షోలతో మాత్రమే ఓపెనింగ్స్ బలపడేది. ‘ఒరిజినల్ టాక్’ బైటికొచ్చి అసలు రంగు బైటపడేలోపలే ఫ్యాన్ ఫాలోయింగ్ ని క్యాష్ చేసుకోవాలి. లేదంటే.. మొదటికే మోసం. అదనపు ఆటలు లేకపోతే మినిమమ్ ఓపెనింగ్స్ రావు.. ఒక సినిమా టాక్ బైటికొచ్చేలోపే మరో సినిమా రిలీజైపోతుంటే… థియేటర్లో వుండే సినిమాకు ‘లాంగ్ రన్’ ఛాన్స్ లేదు. అందుకే… అడకత్తెరలో పోకచెక్కలా… అగమ్య గోచరంగా మారింది పెద్ద సినిమాల పరిస్థితి.

ఏపీ సర్కార్ చేసిన చట్టసవరణతో బిగ్ మూవీస్ నిర్మాతల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. మన సినిమాలు రిలీజయ్యేలోగా ఏదో ఒకటి చేసి సీఎంను ప్రసన్నం చేసుకోవాలని, బెనిఫిట్ షోస్ కి పర్మిషన్లు తెప్పించుకోవాలని అందరికీ వుంది. కానీ పిల్లి మెళ్ళో గంట కట్టేదెవరన్నదే ప్రశ్న. ఇది సక్రమంగా లేదు… పొరుగు రాష్ట్రాల్లోలాగే మాకూ సమన్యాయం కావాలి అంటూ ఒక ట్వీట్ చేసి చేతులు దులుపుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. అప్పుడప్పుడూ ధైర్యంగా గొంతెత్తి మాట్టాడే దగ్గుబాటి సురేష్ బాబు కూడా మైకుల ముందు నాలుగు మాటలతో సరిపెట్టేశారు. చిన్న హీరో అయినా స్టేజినెక్కి పెద్దగా గొంతు చేసుకునే నేచురల్ స్టార్ నానీ కూడా ‘నేను ఎప్పుడో మాట్లాడేశా… ఇక పెద్దోళ్లే చూసుకోవాలి’ అంటూ స్కైలాబ్ ఈవెంట్ లో సైడ్ ఇచ్చుకున్నారు.

రిపబ్లిక్ ఈవెంట్ లో ఆంతెత్తున అరిచినందుకు ‘నీవల్లే రొచ్చయింది’ అని అపవాదును మూటకట్టుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.మంత్రి పేర్ని నాని అయితే… సినిమాటోగ్రఫీ శాఖ సీఎం దగ్గరే వుంది… ఆయనేది చెబితే నేను అదే చేస్తా అంటూ చేతులెత్తేశారు. ఇప్పటికే చాలా చేసి చేతులు కాల్చుకున్నాం.. మా వల్ల కాదు అంటూ దిల్ రాజు లాంటి వాళ్లంతా ప్రేక్షపాత్ర వహిస్తున్నారు. కొందరికి రాజకీయ పట్టింపులు, మరికొందరికి భేషజాలు… ఇప్పుడు ముందుకొచ్చేదెవ్వరు.? పెద్ద సినిమాల్ని గట్టెక్కించే పెద్దన్న జాడ ఎక్కడ? అంటూ ఇండస్ట్రీస్‌లో పెద్ద చర్చ జరుగుతోంది.

– రాజా శ్రీహరి, టీవీ9 ET డెస్క్

Also Read..

MAAలో ఏం జరుగుతోంది..? మంచు కాంపౌండ్‌లో ‘100 రోజుల టెన్షన్’ ఎందుకు?

Parag Agrawal: ట్విట్టర్‌ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాధ్యతలు చేపట్టిన అగర్వాల్‌ ట్వీట్‌.. చిన్నవయస్కుడైన సీఈవోగా రికార్డు