Anushka Shetty: అనుష్క శెట్టి డీప్ ఫేక్ ఫోటోలు వైరల్.. పోలీసులను ఆశ్రయించిన స్వీటీ పేరెంట్స్..!
వరుసగా సినిమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటించింది ఈ బ్యూటీ. స్టార్ హీరోల సినిమాలతోనే కాదు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో మెప్పించింది. అనుష్క నటించిన అరుంధతి సినిమా మంచి విజయాన్ని సాధించడంతోపాటు స్టార్ డమ్ కూడా సొంతం చేసుకుంది. యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోల సరసన కూడా నటించి అలరించింది అనుష్క.

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మల్లో అనుష్క శెట్టి ఒకరు. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అనుష్క. వరుసగా సినిమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటించింది ఈ బ్యూటీ. స్టార్ హీరోల సినిమాలతోనే కాదు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో మెప్పించింది. అనుష్క నటించిన అరుంధతి సినిమా మంచి విజయాన్ని సాధించడంతోపాటు స్టార్ డమ్ కూడా సొంతం చేసుకుంది. యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోల సరసన కూడా నటించి అలరించింది అనుష్క. ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాతో అనుష్క రేంజ్ పెరిగిపోయింది.
రీసెంట్ గా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో హిట్ అందుకుంది అనుష్క. ఇదిలా ఉంటే ఇప్పుడు అనుష్క శెట్టి తల్లి తండ్రులు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. అందుకు కారణం డీప్ ఫేక్ వీడియోలు. ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ డీప్ ఫేక్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొంతమంది సైబర్ నేరగాళ్లు టెక్నాలజీ ఉపయోగించి హీరోయిన్స్ అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు. రష్మిక మందన్న వీడియోలు వైరల్ అవ్వడంతో చాలా మంది దీని పై స్పందించారు. ఇలాంటి అసభ్యకరమైన వీడియోలు క్రియేట్ చేసేవారి పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తాజాగా అనుష్క శెట్టికి సంబంధించిన కొని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొన్నామధ్య అనుష్క , ప్రభాస్ పెళ్లి చేసుకున్నట్టు , వీరికి పిల్లలు పుట్టినట్టు ఫోటోలను క్రియేట్ చేశారు. రీసెంట్ గా అనుష్కకు స్టార్ క్రికెటర్ కు పెళ్లి అంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. అంతే కాదు కొన్ని ఫేక్ ఫొటోలను కూడా క్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో ఇప్పుడు అనుష్క శెట్టి తల్లి దండ్రులు ఇదే విషయం పై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారని తెలుస్తోంది. ఇలాంటి తప్పుడు వార్తలు, ఫోటోలు పుట్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారని సమాచారం. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.
అనుష్క శెట్టి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




