AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Poonam Pandey Death: బ్రేకింగ్.. బాలీవుడ్ నటి పూనమ్ పాండే కన్నుమూత.. షాక్‌లో అభిమానులు

పూనమ్ పాండే క్యాన్సర్ కారణంగా మరణించినట్లు  తెలుస్తోంది. బాలీవుడ్ లో చాలా సినిమాల్లో ఆమె నటించారు. అంతే కాదు చాలా కాంట్రవర్సీలో కూడా చిక్కుకుంది ఈ భామ. తాజాగా క్యాన్సర్ కారణంగా పూనమ్ పాండే కన్నుమూశారని తెలుస్తోంది. పూనమ్ పాండే మరణ వార్త విని  బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

Poonam Pandey Death: బ్రేకింగ్..  బాలీవుడ్ నటి పూనమ్ పాండే కన్నుమూత.. షాక్‌లో అభిమానులు
Poonam Pandey
Rajeev Rayala
|

Updated on: Feb 02, 2024 | 12:12 PM

Share

బాలీవుడ్ హీరోయిన్ పూనమ్ పాండే కన్నుమూశారు. పూనమ్ పాండే(32) క్యాన్సర్ కారణంగా మరణించినట్లు  తెలుస్తోంది. బాలీవుడ్ లో పలు సినిమాల్లో ఆమె నటించింది. అంతే కాదు చాలా కాంట్రవర్సీలో కూడా చిక్కుకుంది ఈ భామ. తాజాగా క్యాన్సర్ కారణంగా పూనమ్ పాండే కన్నుమూశారని తెలుస్తోంది. పూనమ్ పాండే మరణ వార్త విని  బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నిన్న మొన్నటి వరకు యాక్టివ్ గా ఉన్న పూనమ్ ఇప్పుడు సడన్ గా చనిపోవడం ఏంటా అని అంతా షాక్ కు గురవుతున్నారు. పూనమ్‌ను గర్భాశయ క్యాన్సర్‌తో మరణించారని సోషల్ మీడియాలో పోస్ట్ లు వైరల్ అవుతున్నాయి.

పూనమ్ పాండే సినిమాలతో కంటే వివాదాలతోనే ఎక్కువ ఫెమస్ అయ్యింది ఈ భామ. బాలీవుడ్ హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న పూనమ్ పాండే చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. కేవలం సోషల్ మీడియాతోనే అభిమానులకు టచ్ లో ఉంటుంది. గతంలో చాల రకాల వివాదాస్పద కామెంట్స్ చేసి హాట్ టాపిక్ గా మారింది.

సోషల్ మీడియాలో రకరకాల ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. హాట్ హాట్ ఫోటోలు, వీడియోలు తరచు పంచుకునే పూనమ్ పాండే సడన్ గా చనిపోవడం అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఆమధ్య తన భర్త తనను వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. తన భర్త కొట్టడంతో దెబ్బలు తిన్న ఫోటోలను కూడా షేర్ చేసింది పూనమ్ పాండే. పూనమ్ పాండే మరణ వార్త తెలిసి సినీ ప్రముఖులు, ఆమె అభిమానులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఇది నిజం కాదు ఆమె ఇన్ స్టా గ్రామ్ హ్యాక్ అయ్యిందని కామెంట్స్ చేస్తున్నారు. పూనమ్ పాండే చివరిగా  కంగనా రనౌత్ రియాలిటీ షో లాక్ అప్‌లో కనిపించింది.

పూనమ్ పాండే ఇన్ స్టా గ్రామ్..

మూడు రోజుల క్రిత్రం పూనమ్ పాండే ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

'బరాబర్ ప్రేమిస్తా' హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ మామూలుగా లేదుగా
'బరాబర్ ప్రేమిస్తా' హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ మామూలుగా లేదుగా
బంగారం, వెండి అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..! ఈ సీక్రెట్..
బంగారం, వెండి అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..! ఈ సీక్రెట్..
క్యాన్సర్ రమ్మన్నా రాదు.. వీటి జోలికి వెళ్లకపోతే చాలు..
క్యాన్సర్ రమ్మన్నా రాదు.. వీటి జోలికి వెళ్లకపోతే చాలు..
ఒక్కరాత్రిలో టీమిండియా పరువు కాపాడి హీరోగా మారిన హైదరాబాదీ
ఒక్కరాత్రిలో టీమిండియా పరువు కాపాడి హీరోగా మారిన హైదరాబాదీ
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడేవారికి హెచ్చరిక.. హ్యాక్ ముప్పు
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడేవారికి హెచ్చరిక.. హ్యాక్ ముప్పు
రికార్డు స్థాయిలో పెరిగిన భారత విదేశీ మారక నిల్వలు!
రికార్డు స్థాయిలో పెరిగిన భారత విదేశీ మారక నిల్వలు!
మార్చి నెలలో అరుదైన చంద్రగ్రహణం.. భారతదేశంలో ఎక్కడ కనిపిస్తుందంటే
మార్చి నెలలో అరుదైన చంద్రగ్రహణం.. భారతదేశంలో ఎక్కడ కనిపిస్తుందంటే
కలర్, అందాన్ని బట్టి రేటు..నగరంలో విచ్చలవిడిగా చిన్నారుల అమ్మకాలు
కలర్, అందాన్ని బట్టి రేటు..నగరంలో విచ్చలవిడిగా చిన్నారుల అమ్మకాలు
పోషకాల నిధి.. ఆకు కూరల్లో బెస్ట్ ఇదే..
పోషకాల నిధి.. ఆకు కూరల్లో బెస్ట్ ఇదే..
జామకాయ Vs అవకాడో.. ఆరోగ్యానికి ఏది మంచిది..? బరువు తగ్గేవారికి..
జామకాయ Vs అవకాడో.. ఆరోగ్యానికి ఏది మంచిది..? బరువు తగ్గేవారికి..