AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఏఎన్నార్ టు కే. విశ్వనాథ్.. దాదాసాహెబ్ పాల్కే అవార్డు అందుకున్న తెలుగు సినిమా ప్రముఖులు వీరే..

భారతీయ సినిమా రంగానికి సంబంధించి ప్రదానం చేసే అత్యుత్తమ పురస్కారం దాదా సాహెబ్ పాల్కే అవార్డు మోహన్ లాల్ ను వరించింది. 2023 సంవత్సరానికి గానూ ఈ అవార్డును అందుకోనున్నారీ మలయాళం సూపర్ స్టార్. మరి ఇంతకు ముందు ఎవరెవరు ఈ పురస్కారం అందుకున్నారో తెలుసుకుందాం రండి.

Tollywood: ఏఎన్నార్ టు కే. విశ్వనాథ్.. దాదాసాహెబ్ పాల్కే అవార్డు అందుకున్న తెలుగు సినిమా ప్రముఖులు వీరే..
Dadasaheb Phalke Awardees
Basha Shek
|

Updated on: Sep 20, 2025 | 10:59 PM

Share

సినిమా రంగంలో సేవలందించేవారికి మన దేశంలో ప్రదానం చేసే అత్యుత్తమ పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఈ అవార్డును ఇప్పటివరకు 55 మంది సినీ ప్రముఖులు అందుకున్నారు. తాజాగా 2023 సంవత్సరానికి గానూ ఈ అవార్డును మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కు ప్రదానం చేయననున్నారు. ఈ మేరకు శనివారం (సెప్టెంబర్ 2) కేంద్ర సమాచార, ప్రసారాశాఖ ఈ విషయాన్ని ప్రకటించింది. మరి తెలుగుతో పాటు దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎంతమంది దాదాసాహెబ్ పాల్కే అవార్డును అందుకున్నారో తెలుసుకుందాం రండి.

బీఎన్ రెడ్డి

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్న మొదటి సౌతిండియన్ పర్సనాలిటీ బి.ఎన్. రెడ్డి (బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి). 1974లో ఆయన ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం అందుకున్నారు. ‘మల్లీశ్వరి’ వంటి ఎన్నో క్లాసిక్ చిత్రాలను అందించినందుకు గానూ బీ.ఎన్.రెడ్డి ఈ అరుదైన గౌరవం అందుకున్నారు.

ఎల్. వి. ప్రసాద్

ఇవి కూడా చదవండి

తెలుగు నాటకు చెందిన ఎల్.వి. ప్రసాద్ . భారతీయుల తొలి టాకీ చిత్రం ‘ఆలమ్ అరా’లోనూ, తెలుగువారి తొలి మాటల సినిమా ‘భక్త ప్రహ్లాద’లోనూ, తెలుగు-తమిళ భాషల్లో రూపొందిన మొదటి చిత్రం ‘కాళిదాస’లోనూ నటించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషా సినిమాల్లో నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఆయన చేసిన సేవలు అపారమైనది. అందుకే 1982లో ఎల్వీ ప్రసాద్ కు ఫాల్కే అవార్డు లభించింది.

బి. నాగిరెడ్డి నిర్మాతగా ఎన్నోఅద్భుతమైన చిత్రాలను అందించిన బి. నాగిరెడ్డికి 1986లో ఫాల్కే అవార్డు లభించింది. ఆయన ఆసియాలోనే అతిపెద్ద విజయ వాహిని స్టూడియోను నిర్మించారు.

అక్కినేని నాగేశ్వరరావు

దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు కూడా దాదాసాహెబ్ పాల్కే అవార్డు గ్రహీతల జాబితాలో ఉన్నారు. ఆయనకు 1990లో ఫాల్కే అవార్డు లభించింది.

రామానాయుడు

తొమ్మిది భాషల్లో సినిమాలు నిర్మించిన రామానాయుడు భారతదేశంలో అత్యంత విజయవంతమైన నిర్మాతలలో ఒకరు. ఆయనను 2009లో ఫాల్కే అవార్డు వరించింది.

కె విశ్వనాథ్..

శంకరాభరణం’, ‘సాగర్ సంగమం’, ‘స్వాతిముత్యం’, ‘స్వయం కృషి’, ‘సిరివెన్నెల’, ‘శుభలేఖ’ వంటి క్లాసిక్ సినిమాలను తెరకెక్కించాడు కే. విశ్వనాథ్. 2016లో ఆయన ఈ ఫాల్కే అవార్డును అందుకున్నారు.

ఇక దక్షిణాదిలో సూపర్ స్టార్ రజనీకాంత్ (2019), దిగ్గజ దర్శకుడు కె. బాలచందర్ (2010), మలయాళ దర్శకుడు అదూర్ గోపాలకృష్ణన్ (2004), న శివాజీ గణేషన్ (1996), డాక్టర్ రాజ్‌కుమార్‌కు (1995)లో ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.