AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 9 Telugu: ఎలిమినేషన్‏లో పెద్ద ట్విస్ట్.. రెండో వారం ఊహించని కంటెస్టెంట్ బయటకు..

బిగ్‏బాస్ సీజన్ 9.. కామనర్స్ వర్సెస్ సెలబ్రెటీస్ అంటూ సరికొత్తగా తీసుకువచ్చారు. కానీ ఆట మాత్రం సేమ్. మొదటి వారం నుంచే నువ్వా నేనా అంటూ గొడవలు.. సెల్ఫీష్ గేమ్స్ ఆడుతూ.. మరోవైపు ట్రయాంగిల్ కథతో సాగుతుంది. ఇక తొలి వారం కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రెండో వారం ఎలిమినేషన్ సమయం వచ్చేసింది.

Bigg Boss 9 Telugu: ఎలిమినేషన్‏లో పెద్ద ట్విస్ట్.. రెండో వారం ఊహించని కంటెస్టెంట్ బయటకు..
Bigg Boss 9 Telugu Updates
Rajitha Chanti
|

Updated on: Sep 20, 2025 | 10:00 PM

Share

బిగ్‏బాస్ సీజన్ 9 రెండో వారం ఎలిమినేషన్ సమయం దగ్గరపడింది. మరికొన్ని గంటల్లో మరో హౌస్మేట్ బయటకు రానున్నారు. మొత్తం 15 మందితో బిగ్‏బాస్ సీజన్ 9 స్టార్ట్ అయ్యింది. అందులో 9 మంది సెలబ్రెటీస్ కాగా.. ఆరుగురు కామనర్స్ హౌస్ లోకి అడుగుపెట్టారు. మొదటి వారం కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు రెండో వారం ఎలిమినేషన్ సమయం దగ్గర పడింది. తాజాగా శనివారం హోస్ట్ నాగార్జున హౌస్మేట్స్ కు గట్టిగానే క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. వారం మొత్తం హౌస్మేట్స్ చేసిన మీస్టెక్స్ వీడియోస్ చూపించి మరీ ఊతికారేశారు నాగ్. ఇక ఆదివారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనేది ఉత్కంఠగా మారింది.

రెండో వారం మొత్తం ఏడుగురు హౌస్మేట్స్ నామినేషన్ లో ఉన్నారు. భరణి, మర్యాద మనీష్, హరిత హరీష్, ప్రియా, డీమాన్ పవన్, సుమన్ శెట్టి, ఫ్లోరా షైనీ నామినేట్ అయ్యారు. అయితే ఆన్ లైన్ సమాచారం ప్రకారం వీరిలో భరణి, సుమన్ శెట్టి ఓటింగ్ లో దూసుకుపోతున్నారు. సుమాన్ శెట్టి అమాయకత్వం.. నిజాయితీకి అడియన్స్ ఫిదా అవుతున్నారు. దీంతో ఓటింగ్ లో అతడు టాప్ లో దూసుకుపోతున్నారు. ఇక భరణి, డీమాన్ పవన్, ఫ్లోరా షైనీ, హరిత హరీష్ కు సైతం ఓటింగ్ పాజిటివ్ గానే వచ్చినట్లు సమాచారం.

అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం రెండో వారం డేంజర్ జోన్ లో ఇద్దరు కామనర్స్ ఉన్నారు. ప్రియా, మర్యాద మనీష్ ఇద్దరు డేంజర్ డోన్ లో ఉన్నారు. సోషల్ మీడియా టాక్ ప్రకారం వీరిద్దరిలో మర్యాద మనీష్ ఎలిమినేట్ అయినట్లు సమాచారం. ముందు నుంచి రెండోవారం ఎలిమినేషన్ కామనర్స్ నుంచి ఉంటుందని అంతా భావించారు. అయితే హరిత హరీష్ ఎలిమినేట్ కాబోతున్నారని టాక్ వినిపించింది. ఆ తర్వాత ప్రియా ఎలిమినేట్ అయ్యిందంటూ ప్రచారం సాగింది. కానీ చివరి క్షణంలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. రెండో వారం మర్యాద మనీష్ ఎలిమినేట్ అయినట్లు సమాచారం. అయితే ఈ విషయంపై క్లారిటీ రావాలంటే ఆదివారం ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, బాలకృష్ణతో సూపర్ హిట్ సినిమాలు.. 55 ఏళ్ల వయసులోనూ స్టిల్ సింగల్.. ఇప్పటికీ యూత్‏లో యమ క్రేజ్..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..