AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ అమ్మవారిని గుర్తు పట్టారా? టాలీవుడ్ ఫేమస్ యాంకర్ కమ్ నటి కూడా.. ఇప్పుడు మళ్లీ ట్రెండింగ్‌లో..

కలకత్తాలో పుట్టినా చదువంతా హైదరాబాదులోనే కొనసాగింది. చదువుకుంటున్నప్పడే ఇంట్లో చెప్పకుండా కూచిపూడి, కథక్ నేర్చుకుంది. ఆమె డ్యాన్స్‌ చూసి మురిసిపోయిన ఒక ప్రముఖుడు ఆమెకు ఒక టెలిఫిల్మ్‌లో అవకాశం కల్పించాడు. కానీ ఆది ప్రసారానికి నోచుకోలేకపోయింది. అయితే ఆ తర్వాత నటిగానూ, యాంకర్ గానూ బాగా ఫేమస్ అయిపోయింది.

Tollywood: ఈ అమ్మవారిని గుర్తు పట్టారా? టాలీవుడ్ ఫేమస్ యాంకర్ కమ్ నటి కూడా.. ఇప్పుడు మళ్లీ ట్రెండింగ్‌లో..
Tollywood Actress
Basha Shek
|

Updated on: Sep 19, 2025 | 9:05 PM

Share

పై ఫొటోలో అమ్మవారి రూపంలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఆమె ఒకప్పుడు టాలీవుడ్ ఫేమస్ యాంకర్ కమ్ నటి. పలు సూపర్ హిట్ సీరియల్స్ లో నటించింది. అలాగే పలు సినిమాల్లోనూ నటిగా మెరిసింది. ఈ అమ్మడి నటనతో పాటు వాయిస్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. కెరీర్ ప్రారంభదశలో చిన్నా చితక పాత్రలు చేసిందీ అందాల తార. ఆ తర్వాత మెల్లగా నిలదొక్కుకుని ఒక గొప్ప స్థాయికి చేరుకుంది. యాంకర్ గా పాపులర్ అయిన ఆమె నటిగా కూడా సత్తా చాటింది. ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించి మెప్పించింది. అయితే గతంలో కంటే ఇప్పుడు సినిమాలు, సీరియల్స్ తగ్గించేసిందీ అందాల తార. అయితే ఇటీవల రిలీజైన ఓ సూపర్ హిట్ సినిమాలో మళ్లీ కనిపించిందీ సీనియర్ నటి. హీరోకు తల్లిగా నటించి అందరి మన్ననలు అందుకుంటోంది. దీంతో మళ్లీ ఈ ముద్దగుమ్మ పేరు నెట్టింట మార్మోగిపోతోంది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తు పట్టారా? కొంచెం కష్టంగా ఉందా? అయితే మీకో క్లూ.. రాజమౌళి ఛత్రపతి మూవీలో ‘ సూరీడు .. సూరీడు’ అంటూ డైలాగ్ చెప్పిన నటి గుర్తుందా? ఆమెనే అనితా చౌదరి. తాజాగా రిలీజై సంచలన విజయం సాధించిన లిటిల్ హార్ట్స్ సినిమాలో అనిత ఓ కీలక పాత్ర పోషించింది. హీరో మౌళికి తల్లిగా కనిపించి ఆడియెన్స్ ను అలరించింది. దీంతో మళ్లీ ఆమె ఫొటోలు, వీడియోలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి.

యాంకర్ గా, సీరియల్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది అనితా చౌదరి. కస్తూరి, ఋతురాగం, అమృతం వంటి సీరియల్స్ ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. ఇక సినిమాల విషయానికి వస్తే.. సుమారు 50కు పైగా చిత్రాల్లో యాక్ట్ చేసింది. రాజా, మురాళి, సంతోషం, ఆనందం, నువ్వే నువ్వే, ఛత్రపతి, ఉయ్యాల జంపాల, నిన్నే ఇష్టపడ్డాను, వరుడు, కేరింత, మన్మధుడు, గురు, రారండోయ్ వేడుక చూద్దాం వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది.

ఇవి కూడా చదవండి

అనితా చౌదరి లేటెస్ట్ ఫొటోస్..

ఇటీవలే రిలీజైన బ్లాక్ బస్టర్ మూవీ లిటిల్ హార్ట్స్ లో అనితా ఓ కీలక పాత్రలో మెరిసింది. హీరో మౌళికి తల్లి పాత్రలో ఆకట్టుకుంది. ఇక సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుందీ అందాల తార. తరచూ తన ఫొటోలు, వీడియోలను అందులో షేర్ చేస్తుంటుంది. వీటికి నెటిజన్ల నుంచి కూడా మంచి స్పందన వస్తుంటుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే