AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: రెండు కోట్లతో తీస్తే 50 కోట్లు.. అప్పుడే ఓటీటీలో బ్లాక్ బస్టర్ మూవీ! మేకర్స్ పోస్ట్ వైరల్

‘లిటిల్‌హార్ట్స్‌’ .. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా వినిపిస్తోన్నసినిమా పేరు. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా థియేటర్లలో విడుదలైన ఈ యూత్ ఫుల్ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతోంది.

OTT Movie: రెండు కోట్లతో తీస్తే 50 కోట్లు.. అప్పుడే ఓటీటీలో బ్లాక్ బస్టర్ మూవీ! మేకర్స్ పోస్ట్ వైరల్
Little Hearts Movie
Basha Shek
|

Updated on: Sep 20, 2025 | 6:35 AM

Share

చిన్న సినిమాగా విడుదలై, సంచలన విజయాన్ని అందుకుంది ‘లిటిల్‌హార్ట్స్‌’. ప్రముఖ యూట్యూబర్ మౌళి తనూజ్ హీరోగా నటించిన ఈ సినిమాలో శివానీ నాగారం కథానాయిక. సాయి మార్తాండ్ ఈ యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ కు దర్శకత్వం వహించారు. రాజీవ్ కనకాల, ఎస్ ఎస్ కాంచి, సత్య కృష్ణన్, జయకృష్ణ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ తో ఆకట్టుకున్న దర్శకుడు ఆదిత్య హసన్ నిర్మాతగా మారి లిటిల్ హార్ట్స్ సినిమాను నిర్మించాడు. టీచర్స్ డే కానుకగా సెప్టెంబర్ 05న ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఫస్ట్ షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా యూత్ ను ఈ మూవీ తెగ ఆకట్టుకుంటోంది. ఫ్యామిలీ ఆడియెన్స్ సైతం ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు పరుగులు తీస్తున్నారు. కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ లిటిల్ హార్ట్స్ మూవీ ఇప్పటివరకు సుమారు రూ. 50 కోట్ల కు చేరువలో ఉందని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ, మహేష్ బాబు, అల్లు అర్జున్, నాని, మంచు మనోజ్, అడివి శేష్, బండ్ల గణేశ్ తదితర స్టార్ హీరోలు, సినీ ప్రముఖులు కూడా లిటిల్ హార్ట్స్ సినిమాను చూసి ప్రశంసల వర్షం కురిపించారు. ఇప్పటికీ ఈ సినిమా థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్లతో ఆడుతోంది. అదే సమయంలో చాలా మంది ఈ సినిమాను ఓటీటీలో చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు.

ఈ క్రమంలో లిటిల్ హార్ట్స్ సినిమా అక్టోబర్ 02 నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుందంటూ ప్రచారం జరుగుతోది. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో కొన్ని పోస్టులు కూడా వైరలవుతున్నాయి. వీటిపై ఈటీవీ విన్ ఓటీటీ స్పందించింది. ఫేక్ పోస్టులు, వార్తలపై స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చింది. అక్టోబరు 2న లిటిల్ హార్ట్స్ సినిమా విడుదల అవుతుందంటూ ట్రెండ్‌ అవుతున్న ఫేక్‌ పోస్టర్‌ను పంచుకుంటూ ‘ఇలా నకిలీ ప్రచార ఫొటోలను వ్యాప్తి చేస్తే, మీ ఫోను మీద ఒట్టే’ అంటూ తన దైన శైలిలో వార్నింగ్ ఇచ్చింది. ‘మీరు ఇది ఊహించవద్దు. ప్రస్తుతం థియేటర్‌లన్నీ హౌస్‌ఫుల్‌తో రన్‌ అవుతున్నాయి’ అంటూ పేర్కొంది. అంటే ‘లిటిల్‌ హార్ట్స్‌’ ఓటీటీలోకి రావడానికి మరికొన్ని రోజులు ఆగాల్సిందేనన్నమాట.

ఇవి కూడా చదవండి

మీ ఫొన్ మీద ఒట్టే..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే