Tollywood: 13 ఏళ్లకే సినిమాల్లోకి.. 250కు పైగా చిత్రాలతో ఇండస్ట్రీని శాసించిన హీరోయిన్.. గుర్తు పట్టారా?
హీరోలతో పోల్చుకుంటే ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ చాలా తక్కువగా ఉంటుంది. వరుసగా ఒకటి రెండు ఫ్లాపులు పడితే చాలా చాలా మంది ఫేడవుట్ అయిపోతుంటారు. ఇంకొందరు పెళ్లి చేసుకుని సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేస్తుంటారు. కానీ ఈ హీరోయిన్ మాత్రం గత 40 ఏళ్లుగా సినిమాల్లో నటిస్తూనే ఉంది.

పై ఫొటోలోని సర్కిల్‌లో ఉన్న అమ్మాయిని గుర్తు పట్టారా? ఆమె ఇప్పుడు భారతీయ సినిమా ఇండస్ట్రీలోనే ఫేమస్ నటి. పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకుంది. 55 ఏళ్లు దాటినా పవర్ ఫుల్ రోల్స్ చేస్తూ కుర్ర హీరోయిన్లకు కునుకు లేకుండా చేస్తోంది. ఇటీవల ఆమె నటించిన సినిమాలు దాదాపు అన్నీ వందల కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినవే. అందుకే ఈ ముద్దుగుమ్మతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు క్యూలో ఉంటారు. మద్రాసులో పుట్టి పెరిగిన ఈ అందాల తార 13 ఏళ్లకే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత హీరోయిన్ గానూ ఎంట్రీ ఇచ్చింది. తన అందం, అభినయంతో స్టార్ హీరోయిన్లకు చుక్కలు చూపించింది. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, బాలకృష్ణ, మోహన్ బాబు, రజనీకాంత్.. ఇలా ఎందరో స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. స్టార్ హీరోయిన్ గా కొన్నేళ్ల పాటు సినిమా ఇండస్ట్రీని ఏలిందీ అందాల తార. చాలా మంది హీరోయిన్లు పెళ్లి, పిల్లల తర్వాత ఇండస్ట్రీకి దూరమైపోతారు. కానీ ఈ ముద్దుగుమ్మ మాత్రం తన వయసుకు తగ్గ పాత్రల్లో నటిస్తూ ఆడియెన్స్ ను అలరిస్తోంది. ప్రస్తుతం దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో పవర్ ఫుల్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఆమె మరెవరో కాదు శివగామి రమ్యకృష్ణ.
రమ్య 13 ఏళ్ల వయసులోనే నటించడం ప్రారంభించింది. 1983లో విడుదలైన ‘వెల్లై మిందానా’ ఆమె మొదటి సినిమా. వై.జి.మహేంద్రన్‌తో కలిసి స్క్రీన్‌ను పంచుకుంది. రమ్యకృష్ణ కు సినీ పరిశ్రమతో నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుబంధం ఉంది. తెలుగు, కన్నడ, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో ఆమె సుమారుగా 250 కు పైగా సినిమాల్లో నటించింది. హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఆమె ఈ మధ్య కాలంలో సపోర్టింగ్ రోల్స్ లో ఆకట్టుకుంటోంది.
రమ్యకృష్ణ లేటెస్ట్ ఫొటోస్..
View this post on Instagram
ప్రభాస్ నటించిన ‘బాహుబలి’ సినిమాలో రాజ మాత శివగామి దేవి పాత్రతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుందీ సీనియర్ హీరోయిన్. ఈ సినిమా రమ్యకృష్ణ క్రేజ్ ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లింది. ఇక రజనీతో కలిసి ఆమె నటించిన జైలర్ సినిమా కూడా రూ. 650 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. రంగ మార్తాండ సినిమాలో అద్భుతంగా నటించిన రమ్యకృష్ణ, చివరిగా తెలుగులో రాజ్ తరుణ్ తో కలిసి పురుషోత్తముడు సినిమాలో కనిపించింది. ప్రస్తుతం జైలర్ 2తో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు ఈ అందాల తార చేతిలో ఉన్నాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








