Balakrishna: ఆ స్టార్ నటి కూతుళ్లతో బాలయ్య.. మోకాళ్ల మీద కూర్చొని ఫొటోలు దిగిన నందమూరి హీరో.. వీడియో ఇదిగో
సినిమాల్లో రఫ్ అండ్ టఫ్ గా కనిపించే బాలయ్య కు రియల్ లైఫ్ బాలయ్యకు చాలా వ్యత్యాసముంది. అదేంటో ఆయనకు దగ్గరగా ఉన్నవారిని అడిగితే అర్థమవుతుంది. తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు బాలయ్య. తన దగ్గరకు వచ్చిన ఓ స్టార్ నటి పిల్లలతో మోకాళ్ల మీద కూర్చొని సరదాగా ఫొటోలు దిగారు.

బాలయ్యకు కోపమెక్కువ.. అభిమానుల మీద కూడా చేయి చేసుకుంటాడంటూ సోషల్ మీడియాలో పలు వీడియోలు కనిపిస్తుంటాయి. కానీ అలాంటివి ఆ సందర్భంలో ఉన్న పరిస్థితిని బట్టి రియాక్ట్ అయ్యాడని, స్వతహాగా బాలయ్య మనసు బంగారం అని ఆయనను దగ్గర్నుంచి చూసేవారికి మాత్రమే అర్థమవుతుంది. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ తో ఎంతోమందికి ఉచితంగా క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఇస్తున్నారీ నందమూరి హీరో. బాలయ్య గొప్ప తనానికి ఇంతకన్నా మంచి నిదర్శనం అవసరం లేదు. సినిమాల్లో రఫ్ అండ్ టఫ్ గా కనిపించే బాలయ్య నిజ జీవితంలో మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటారు. కోపం వచ్చినప్పుడు ఎంత ఉగ్రంగా ఉంటారో, సాధారణ సమయాల్లో అంతే ప్రేమను కురిపిస్తారు. ముఖ్యంగా చిన్న పిల్లల పట్ల బాలయ్య ఎంతో ఆప్యాయత, అనురాగం చూపిస్తారు. తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు నందమూరి హీరో. ఓ కార్యక్రమంలో ఇద్దరు చిన్నారులతో ఎంతో సరదాగా కలిసి తిరిగాడు. మోకాళ్లపై కూర్చొని మరీ వారితో ఫొటోలు దిగారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసిన బాలయ్య అభిమానులు తెగ మురిసిపోతున్నారు. ‘మా బాలయ్య బాబు గోల్డ్ అహే’ అంటూ తెగ ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇంతకీ బాలయ్యతో ఫొటోలు దిగిన ఆ పిల్లలు ఎవరో తెలుసా? స్టార్ యాంకర్ కమ్ నటి ఉదయ భాను ఇద్దరు కవల కూతుళ్లు. తాజాగా జరిగిన ఓ కార్యక్రమానికి బాలయ్య, ఉదయభాను హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలయ్యను చూసిన ఉదయభాను కూతుళ్లు భూమి ఆరాధ్య, యువి నక్షత్ర ఆయన దగ్గరకు వెళ్లారు. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఆయనతో ఫొటోలు దిగారు.
ఉదయభాను కూతుళ్లతో బాలయ్య.. వీడియో..
View this post on Instagram
ఉదయభాను బాలకృష్ణను అమితంగా అభిమానిస్తుంది. గౌరవిస్తుంది. తాను కష్టాల్లో ఉన్నప్పుడు బాలయ్య అండగా నిలిచారని పలు సందర్భాల్లో ఉదయ భాను చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఆమె కూతుళ్ల మొదటి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా వచ్చి ఆశీర్వదించారు. ఈ క్రమంలోనే తన కూతుళ్లతో బాలయ్య గడిపిన సరదా క్షణాలను ఉదయభాను సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు, వీడియోలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి.
ఇద్దరు కూతుళ్లతో ఉదయభాను..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








